ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆరో రోజుకు చేరుకుంది… చర్చలు విఫలం అయిన తర్వాత తన భీకరంగా విరుచుకుపడుతోంది రష్యా.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో రష్యా బలగాలు మోహరించాయి.. ఏ క్షణమైనా.. ఏదైనా జరిగే ప్రమాదం ఉంది.. అయితే, దీంతో.. ఆయా దేశాలు తమ రాయబార కార్యాలయాలను కూడా ఖాళీ చేశాయి.. అత్యవసరంగా కీవ్ సిటీని వీడాలంటూ భారతీయులను హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం.. పరిస్థితి ఇలా ఉంటే.. రష్యాకు ఉక్రెయిన్ ఆర్మీ నుంచే కాదు.. సాధారణ పరుల నుంచి కూడా ప్రతిఘటన ఎదురవుతోంది.. ఉక్రెయిన్‌లోని బఖ్‌మాచ్ వీధుల్లో ఒక వ్యక్తి రష్యన్ యుద్ధ ట్యాంకుని ఒంటి చేత్తో పట్టుకుని ఆపేశాడు.. వీడియోలో ఆ వ్యక్తి మొదట ట్యాంక్ పైకి ఎక్కాడు, ఆపై తన చేతులతో ట్యాంక్‌ను నెట్టడానికి నేలపైకి దూకాడు. తరువాత, అతను ట్యాంక్ ముందుకు వెళ్లకుండా ఆపే ప్రయత్నంలో ముందు మోకరిల్లాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది..
Read Also: Russia-Ukraine War: తక్షణమే ‘కీవ్’ని వీడండి.. కేంద్రం కీలక ఆదేశాలు..
బఖ్‌మాచ్‌లో రష్యా యుద్ధ ట్యాంకును ఆపేసి.. ఆ తర్వాత మోకాళ్లపై కూర్చున్న ఆ వ్యక్తిని వెంటేనే అక్కడ ఉన్న స్థానికి మద్దతుగా వచ్చారు.. మొత్తంగా ఆ యుద్ధ ట్యాంక్‌ను ఆపేశాడు ఉక్రెయిన్ పౌరుడు.. ఈ వీడియోని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. అంతేకాదు ఉక్రెయిన్ అధికారులు ఇన్‌స్టాగ్రాంలో ఉక్రెయిన్ ప్రజలను బందిఖానాలో ఉంచుతానని రష్యా సంవత్సరాలుగా అబద్ధం చెబుతోంది. వాస్తవమేమిటంటే ఉక్రేనియన్ ప్రజలు స్వేచ్ఛగా జీవించడమే కాదు అవసరమైతే తమ ఒట్టి చేతులతో రష్యన్ ట్యాంకులను ఆపడానికి సిద్ధంగా ఉన్నారంటూ రాసుకొచ్చింది. కాగా, ఉక్రెయిన్ – రష్యా యుద్ధానికి సంబంధించిన మరికొన్ని వీడియోలు కూడా హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే.. రష్యా సైనికుడిని పట్టుకుని.. మా దేశానికి ఎందుకు వచ్చారంటూ ఓ మహిళ నిలదీయడం.. మరో సైనికుడితో ఓ చిన్నారి వాగ్వాదానికి దిగిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
