కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ట్రేస్, టెస్ట్, ట్రీట్ విధానాన్ని అవలంభిస్తున్నారు. కరోనా రోగులను గుర్తించి వారిని మిగతా వాళ్లనుంచి దూరంగా ఉంచి ట్రీట్‌మెంట్ చేస్తే కరోనా చెయిన్ ను బ్రెక్ చెయవచ్చు. అయితే, కరోనా రోగులకు గుర్తించడం పెద్ద సమస్యగా మారింది. శరీరంలో కరోనా వైరస్ ఉన్నప్పటీకీ లక్షణాలు కనిపించకపోవడంతో మాములు వ్యక్తుల్లో కలిసి మెలిసి తిరుగుతున్నారు. దీంతో ఇతరులకు కరోనా సోకుతున్నది.
అయితే, బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు శరీర వాసనలతో కరోనాను గుర్తించే పరికరాన్ని డెవలప్ చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్, డర్హం యూనిర్శిటి పరిశోధకులు కలిసి పనిచేసి పరిశోధనలు చేశారు. కోళ్లకు సోకిన ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించేందుకు వాడుకలో ఉన్న శాంప్లింగ్ పద్దతికి మార్పులు చేర్పులు చేసి రెండు రకాల పరికరాలను తయారు చేశారు. అందులో ఒకటి మోబైల్ ఫొన్ ఆకృతిలో ఉండే పరికరం కాగా, రెండోది సీసీ కెమెరా తరహా పరికరం. ఈ పరికరాన్ని గదిలో అమర్చినపుడు స్కాన్ చేస్తుంది. స్కానర్ ఆధారంగా ఆ గదిలో కరోనా ఇన్‌ఫెకక్షన్ ఉన్నదా లేదా అన్నది గుర్తిస్తుంది. అయితే, కరోనా రోగులను గుర్తించలేదని, దానికోసం పరీక్షలు నిర్వహించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
