US Visa Policy 2025: అమెరికా అధ్యక్షుడిగా సెకండ్ టైమ్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ వీసా, పౌరసత్వ విధానాలను మరింత కఠినతరం చేసే దిశగా సరికొత్త ఆలోచనలు చేస్తూనే ఉన్నారు. యూఎస్ ప్రభుత్వం నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం వీసా వ్యవస్థలో పలు మార్పులు చేయనుందని అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ కొత్త ప్రెసిడెంట్ జోసెఫ్ ఎడ్లౌ ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు.
Read Also: Deputy CM Pawan: ఏనుగుల దాడిలో రైతు మృతి.. ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి!
అయితే, అమెరికా పౌరసత్వం కోసం నిర్వహించే పరీక్షలను మరింత క్లిష్టంగా మార్చాలనే యోచనలో ఉన్నట్లు యూఎస్ ఇమిగ్రేషన్ ప్రెసిడెంట్ జోసెఫ్ ఎడ్లౌ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షలు ఏమాత్రం కఠినంగా లేవు.. కాబట్టి బట్టీ పట్టి అప్పగించే ఆన్సర్స్ ఉంటున్నాయి.. దీని వల్ల యూఎస్ ఆర్థిక వ్యవస్థ కోసం హెచ్-1బీ వీసాను ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై పునరాలోచన చేస్తున్నాం అని వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే దీన్ని సంస్కరించే ప్రయత్నాలు స్టార్ట్ చేశాం.. కానీ, ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించారని చెప్పుకొచ్చారు.
