NTV Telugu Site icon

Titanic: టైటానిక్ చివరి డిన్నర్ మెనూకు వేలంలో రికార్డ్ ధర..

Titanic Dinner Menu Auction

Titanic Dinner Menu Auction

Titanic: టైటానిక్.. ఈ అద్భుత నౌక ప్రమాదం బారిన పడి మునిగిపోయి వందేళ్లు గడుస్తున్నా.. ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. 1912, ఏప్రిల్ 14న రాత్రి సమయంలో ఈ నౌక మంచుకొండను ఢీకొట్టి సముద్రంలో మునిగిపోయింది. 1500 మంది సముద్రంలో మునిగిపోయి మరణించారు. ఇటీవల సముద్రం అంతర్భాగంలో ఉన్న టైటానిక్ శిథిలాలను చూసేందుకు టైటాన్ సబ్ మెర్సిబుల్‌లో వెళ్లిన ఆరుగురు మరణించిన వార్త ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. మరోసారి టైటానిక్ విషాదాన్ని ప్రజలు గుర్తుకు తెచ్చుకునేలా చేసింది.

Read Also: Justin Trudeau: “పెద్ద దేశాలు, అంతర్జాతీయ చట్టాలు” అంటూ.. మరోసారి భారత్‌పై కెనడా ప్రధాని వ్యాఖ్యలు..

అయితే టైటానిక్ ముగినిపోవడానికి మూడు రోజుల ముందు ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల చివరి డిన్నర్ మెనూ ఇప్పుడు వేలంలో రికార్డ్ స్థాయిలో ధర పలికింది. అయితే ప్రమాద సమయంలో లైఫ్ బోట్ల ద్వారా రక్షించబడిన వ్యక్తుల్లో ఎవరు ఈ మెనూను తీసుకువచ్చారనే దానిపై ప్రశ్నల్ని లేవనెత్తింది. మెనూలోని ఆప్రికాట్స్, ఫ్రెంచ్ ఐస్ క్రీమ్ ఉన్నాయి. ఎగ్స్, జామ్, బ్రాందీ, ఆపిల్స్, చెర్రీస్ వంటివి పేర్కొనబడ్డాయి. ఏప్రిల్ 11 డిన్నర్ మెనూలో ఆయస్టర్స్, సాల్మన్, బీఫ్, స్క్వాబ్, డక్, చికెన్ వీటితో పాటు బంగాళాదుంపలు, రైస్ వంటివి మెనూలో కనిపిస్తున్నాయి.

ఐర్లాండ్ లోని క్వీన్స్ టౌన్ నుంచి న్యూయార్క్‌కి బయలుదేరిన టైటానిక్ మరుసటి రోజు అందించిన భోజనం వివరాలను ఈ మెనూ వివరిస్తోంది. దీన్ని హెన్నీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ ఆఫ్ విల్ట్‌షైర్ వేగం వేసింది. దీంతో పాటు టార్టాన్ డెక్ బ్లాంకెట్‌తో సహా ఇతర టైటానిక్ కళా కండాలు ఉన్నాయి. ఇంగ్లండ్ లో శనివారం సాయంత్రం జరిగిన వేలంలో 83,000 పౌండ్లు( రూ.84.5 లక్షలు) పలికిండని యూకేకి చెందిన వార్తా పత్రిక గార్డియన్ నివేదించింది.