75 Hard Fitness Challenge: నీళ్లు బాగా తాగితే ఆరోగ్యంగా ఉంటామని ఆరోగ్య నిపుణులు అంటుంటారు. అలాగని అతిగా తాగితే మాత్రం.. తీవ్ర పరిణామాలు తప్పవు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యమే ఈ తాజా ఉదంతం. ఓ ఫిట్నెస్ ఛాలెంజ్‌లో భాగంగా.. 12 రోజుల పాటు నాలుగు లీటర్ల నీళ్లు తాగిన పాపానికి, కెనడాకు చెందిన ఓ టిక్‌టాకర్ ఆసుపత్రిపాలైంది. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఆ వివరాల్లోకి వెళ్తే..
Ice Cream: ఐస్ క్రీమ్ తినడం వల్ల లాభాలు కూడా ఉన్నాయి తెలుసా?
ఈ ఛాలెంజ్ పేరు 75 హార్ట్. ఇందులో పాల్గొనేవారు 75 రోజుల పాటు నాలుగు లీటర్ల నీరు తాగాలి. ఆల్కహాల్ లేదా ‘చీట్ మీల్స్’ లేని స్ట్రక్చర్డ్ డైట్‌ని అనుసరించాలి. రోజుకు 45 నిమిషాల పాటు రెండుసార్లు వర్కవుట్ చేయాలి. రోజుకి 10 పేజీల చదవాలి. ఈ మొత్తం ప్రాసెస్‌కి సంబంధించి ఫోటో తీయాలి. ఈ ఛాలెంజ్‌ని మొదట ఆండీ ఫ్రిసెల్లా అనే యూట్యూబర్ ప్రారంభించారు. ఫిట్నెస్‌కి సంబంధించింది కాబట్టి.. చాలామంది ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడం ప్రారంభించారు. వారిలో కెనడాకి చెందిన మిచెల్ ఫెయిర్‌బర్న్ అనే టిక్‌టాకర్ ఒకరు. ఈమె 12 రోజుల పాటు నాలుగు లీటర్ల నీళ్లు తాగడంతో.. అనారోగ్య బారిన పడింది. దీంతో.. ఆసుపత్రిపాలయ్యింది.
Small Business Idea: ఈ బిజినెస్ చేయండి.. నష్టమే లేకుండా లక్షలు సంపాదించండి
ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నందుకు తనకు వాటర్ పాయిజనింగ్ అయ్యిందని తాను అనుకుంటున్నానని, తనకు అస్సలు బాగోలేదని మిచెల్ ఓ వీడియోలో పేర్కొంది. తన ఛాలెంజ్‌లో భాగంగా.. 12వ రోజు రాత్రి పడుకునే సమయంలో తనకు ఆరోగ్యం సహకరించలేదని, బాత్రూంకి వెళ్లడానికి చాలాసార్లు నిద్రలేవాల్సి వచ్చిందని చెప్పింది. తాను ఏమీ తినలేకపోయానని.. రాత్రంతా వికారకంగా, బలహీనంగా ఉందని.. బాత్రూంలోనే తాను ఆ ఉదయం గడిపానని తెలిపింది. ఉదయాన్నే తాను వైద్యుడ్ని సంప్రదించగా.. పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం సోడియం లోపం తీవ్రంగా ఉందని చెప్పారు. రోజుకు అరలీటర్ కంటే తక్కువ నీరు తాగాలని సూచించారు.
Viral News: కుమ్మేదాకా వదలనంటున్న ఎద్దు.. భయంతో చెట్టెక్కిన వ్యక్తి
అయినప్పటికీ మిచెల్ ఈ ఛాలెంజ్ నుంచి తప్పుకోలేదు. కంటిన్యూ చేస్తూనే ఉంది. ‘‘సోడియం లోపం చాలా ప్రాణాంతకమైనది కావొచ్చు. అందుకే.. నేను ప్రతిరోజూ ఆసుపత్రికి వెళ్తున్నాను. నాలో సోడియం స్థాయిల్ని పెంచేందుకు నన్ను ప్రతిరోజూ పరీక్షిస్తున్నారు. ఇప్పటికీ నేను 75 హార్డ్ ఛాలెంజ్ చేయబోతున్నాను, నేను ఏమాత్రం ఓటమిని అంగీకరించను. కానీ.. వైద్యుడు రోజుకు అర లీటరు కంటే తక్కువ నీరు తాగాలని సూచించాడు’’ అంటూ చెప్పుకొచ్చింది.