Site icon NTV Telugu

Rice At America: అమెరికాలో బియ్యం కొరత లేదంట.. ప్రకటించిన అపేడా

Rice At America

Rice At America

Rice At America: బియ్యం వాడకం ఇండియాలోని ప్రజలతోపాటు.. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఉంటున్న భారతీయులు వాడుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రపంచంలోని ఇతర దేశాల్లో భారతీయులు ఎక్కువ మందే ఉంటున్నారు. ప్రధానంగా అమెరికాలో ఎక్కువ మంది ఉంటారు. అమెరికాలో ప్రవాసాంధ్రులు లక్షల్లో ఉంటారు. వారు అమెరికాలో ఉన్న బియ్యం వాడకంను కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలోవిదేశాల్లో కూడా బియ్యం వాడకంను కొనసాగిస్తారు. అయితే ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం నాన్‌- బాసుమతి బియ్యం ఎగుమతిపై నిషేధం విధించడంతో.. అగ్రరాజ్యమైన మెరికాతోపాటు.. ఇతర దేశాల్లోని భారతీయులకు బియ్యం పంపిణీ చేయడం కష్టంగా మారనుంది. అమెరికాలో బియ్యం కొరత లేదంట. అమెరికాలో అర్నెల్లకు సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయని వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ(అపెడా) ప్రకటించింది. బియ్యం ఎగుమతులపై ఇండియా నిషేధం విధించినా.. అమెరికాలో ఆర్నెల్లకు సరిపడా బియ్యం నిల్వలున్నాయని అపెడా ప్రకటించింది.

Read also: Airtel Recharge Plans 2023: ఎయిర్‌టెల్‌ నుంచి కొత్త ప్లాన్‌.. యాక్టివ్‌ ప్లాన్‌లోనే యాడ్‌ చేసుకోవచ్చు!

ప్రస్తుతం అమెరికలో 12వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం నిల్వలున్నాయని అపెడా ప్రకటించింది. నిషేధానికి ముందే మరో 18 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా అయిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అమెరికా ప్రతి నెలా 6వేల టన్నుల నాన్‌- బాసుమతి బియ్యాన్ని భారత్‌ నుంచి దిగుమతి చేసుకుంటుందని.. ఇందులోనూ తెలంగాణ, ఏపీ నుంచి ఆయా రాష్టరాల వాటా 4 వేల టన్నులని వివరించారు. బియ్యం ఎగుమతుల నిషేధంతో అమెరికాలో 9.7 కేజీల బియ్యం బస్తా ధర 18 డాలర్ల నుంచి 50 డాలర్లకు పెరిగిందన్నారు. అమెరికాలోని భారతీయులు సోనామసూరి బియ్యం ఎక్కువగా వినియోగిస్తారని.. వాటిపై ఉన్న నిషేధాన్ని వెంటనే ఉపసంహారించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి అపెడా విజ్ఞప్తి చేసింది.

Exit mobile version