ఆఫ్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. 20 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్థాన్‌లో తమ హయాంలో సాగించిన అరాచకపాలనలు క్రమంగా మళ్లీ అమలు చేస్తున్నారు.. గతంలో తాలిబన్ల పాలనలో శిక్షల్ని బహిరంగంగానే విధించేవారు. కాళ్లు నరికేయటం, చేతులు నరికేయటం వంటి పలు హింసాత్మక శిక్షల్ని అమలు చేసేవారు. అటువంటి శిక్షలపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఎంతోమంది ఖండించినా తాలిబన్లు పట్టించుకోలేదు.. అంతేకాదు.. తాలిబన్ 2.0లోనూ మళ్లీ హింసాత్మక శిక్షలను అమలు చేస్తామని ఇటీవలే ప్రకటించారు.. ఒకప్పటిలా క్రూర విధానాలను తమ పాలనలో తిరిగి అమలు చేస్తామని చెబుతున్నారు. అంతే కాదు.. ఇవాళ వాటిని అమల్లోకి తీసుకొచ్చారు.
ఇటీవలే ప్రకటించిన వెంటనే అమల్లో పెట్టారు తాలిబన్లు.. దీంతో వారికి అరచకపాలన మళ్లీ మొదలు పెట్టారు.. ఇక, విషయానికి వస్తే.. హెరాత్ సిటీలో వ్యాపారిని కిడ్నాప్ చేసిన నలుగురికి మరణశిక్ష విధించారు తాలిబన్లు.. నలుగురిని బహిరంగంగా కాల్చి చంపేవారు.. ఆ తర్వాత మృతదేహాలను సిటీ జంక్షన్‌లో క్రేన్లతో వేలాడదీసిన తాలిబన్లు తమ క్రూరత్వాన్ని బయటపెట్టారు. కాగా, దోషులను కఠినంగా శిక్షిస్తామంటూ ఇటీవలే ప్రకటించిన తాలిబన్లు.. కాళ్లు, చేతులు నరకడం వంటి శిక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించిన సంగతి తెలిసిందే.
