Site icon NTV Telugu

Shubhanshu Shukla: కుమారుడు రోదసిలోకి వెళ్తుండగా భావోద్వేగానికి గురైన శుభాంశు శుక్లా తల్లి

Shubhanshushuklamother

Shubhanshushuklamother

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లారు. బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు రోదసి యాత్ర ప్రారంభమైంది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌సెంటర్‌ నుంచి ఫాల్కన్‌ 9 రాకెట్‌ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. స్పేస్ స్టేషన్‌కు చేరుకునేందుకు 28 గంటల ప్రయాణం సాగనుంది. 14 రోజుల పాటు ఐఎస్‌ఎస్‌లో శుభాంశు శుక్లా గడపనున్నారు. శుభాంశు శుక్లా రోదసి యాత్ర కోసం భారత్ రూ.550 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇస్రో, నాసా యాక్సియం-4 మిషన్ ప్రయోగం చేపట్టింది. శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు రోదసిలోకి వెళ్లారు.

ఇది కూడా చదవండి: UP: నన్ను తాకితే 35 ముక్కలు చేస్తా.. తొలి రాత్రి నవ వధువు హల్‌చల్.. ఆలస్యంగా వెలుగులోకి..!

ఇదిలా ఉంటే శుభాంశు శుక్లా రోదసి యాత్ర ప్రారంభమైన సమయంలో కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. సంతోషంతో తల్లి ఆశా శుక్లా కన్నీళ్లు పెట్టుకున్నారు. యాక్సియం-4 అంతరిక్ష నౌక వెళుతుండగా ఒక పెద్ద స్క్రీన్ వైపు రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయారు. ఇక ఆమె పక్కన కూర్చున్న భారత వైమానిక దళ పైలట్ తండ్రి శంభు దయాళ్ శుక్లా ఉత్సాహంగా నవ్వుతూ కనిపించారు. ఆశా శుక్లా కన్నీళ్లు తుడుచుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రయాణానికి ముందు తల్లిదండ్రులతో శుభాంశు శుక్లా వీడియోకాల్‌లో మాట్లాడారు.

ఇది కూడా చదవండి: Ganguly Biopic : క్రికెట్ ఐకాన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ పై లేటేస్ట్ అప్‌డేట్..

రోదసిలోకి వెళ్తున్న రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డ్ సృష్టించారు. 1984లో వింగ్ కమాండర్ రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఆ రికార్డ్‌ను 39 ఏళ్ల శుభాంశు శుక్లా తిరగ రాస్తున్నాడు. అమెరికా, పోలాండ్, హంగేరీకి చెందిన ముగ్గురు వ్యోమగాములతో కలిసి శుభాంశు శుక్లా రోదసిలోకి వెళ్లారు. 1969లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్ర మండలానికి వెళ్లింది ఈ ప్రదేశం నుంచి కావడం విశేషం. నలుగురు సభ్యుల బృందం 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు.

వాతావరణం, సాంకేతిక కారణాలతో ఆక్సియం-4 మిషన్ ప్రయోగం ఆరుసార్లు వాయిదా పడింది. ఇన్నాళ్లకు ఆక్సియం-4 మిషన్ ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39ఏ నుంచి ఫాల్కన్‌-9 ఎగిరింది. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్‌ ఈ మిషన్‌ను నిర్వహిస్తోంది. ఇస్రో, నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)లు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ స్పేస్ క్యాప్సూల్‌ను ఫాల్కన్‌-9 రాకెట్‌ నింగిలోకి మోసుకెళుతోంది. 28 గంటల తర్వాత వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమవుతుంది. శుభాంశు బృందం 14 రోజుల పాటు అక్కడే ఉండి పరిశోధనలు చేస్తారు.

యాక్సియం-4 మిషన్‌ ప్రయోగం.. మొదట మే 29న ప్రయోగించాల్సి ఉండగా సాంకేతిక, వాతావరణ కారణాలతో జూన్ 8కి వాయిదా పడింది. తిరిగి జూన్ 10, జూన్ 11, జూన్ 12కి వాయిదా పడింది. స్పేష్ ఎక్స్ అంతరిక్ష నౌకలో లీక్ కారణంగా ప్రయోగం తిరిగి జూన్ 19కి వాయిదా పడింది. మళ్లీ అనివార్య కారణాల చేత జూన్ 22కి వాయిదా పడింది. తిరిగి ఇన్ని రోజులకు జూన్ 25న యాత్ర ప్రారంభం అయింది. యాత్ర సక్సెస్ కావాలని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారు. ఇక భారత వ్యోమగామి శుభాంశుకి భారతీయులు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Exit mobile version