South Africa Singer Costa Titch Dies On Stage In Festival: ఈమధ్య వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో కుప్పకూలుతున్న సంఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. యుక్త వయసులో ఉన్న వాళ్లు కూడా ఉన్నట్లుండి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు కోస్టా టిచ్ అనే 27 ఏళ్ల ర్యాపర్ కూడా.. లైవ్‌లో పాటలు పాడుతూ, స్టేజ్‌పైనే కుప్పకూలాడు. సెకన్ల వ్యవధిలోనే రెండుసార్లు పడిపోయాడు. మొదటిసారి పడిపోయినప్పుడు, పక్కనే ఉన్న ఒక వ్యక్తి పైకి లేపాడు. అప్పుడు తిరిగి పాట పాడటం మొదలుపెట్టిన ఆ ర్యాపర్.. కొన్ని క్షణాల్లోనే మళ్లీ పడిపోయాడు. స్టే్జ్ మీద ఉన్న వాళ్లు ఏమైందోనని కంగారు పడ్డారు. అతడ్ని లేపేందుకు ఎంత ప్రయత్నించినా స్పందన లేకపోవడంతో.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆలోపే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కోస్టా టిచ్ మృతితో అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 27 ఏళ్లకే అతడు మృతిచెందడంతో.. కుటుంబ సభ్యులు కన్నీంటిపర్యంతమయ్యారు. తాము ఇప్పుడు అత్యంత విపత్కర పరిస్థితిని ఎదుర్కుంటున్నామని భారమైన హృదయంలో చెప్పారు.
Wife Swap: బెడ్ రూమ్‌కు భార్యను పంపమన్నాడు.. శవమై తేలాడు
కాగా.. జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న ‘అల్ట్రా సౌత్ ఆఫ్రికా మ్యూజిక్ ఫెస్టివల్’లో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ, కోస్టా టిచ్ స్టేజ్ మీదే పడిపోయాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అతని మృతికి గల ప్రధాన కారణాలేంటో ఇంకా స్పష్టత లేదు. గుండెపోటు అని అనుకుంటున్నారు కానీ, సరైన కారణం అదేనా? కాదా? అనేది తేలాలి. అతని కుటుంబ సభ్యులు సైతం.. ఇందుకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇదిలావుండగా.. కోస్టా టిచ్ ఎంబాంబెలాకు చెందినవాడు. సింగింగ్ మీద మక్కువతో అతడు ఈ రంగంలోకి అడుగుపెట్టాడు. స్టార్ రైటర్‌గా ఆల్రెడీ తన ముద్ర వేసిన కోస్టా.. ఇప్పుడిప్పుడే సింగర్‌గా ఎదుగుతున్నాడు. అమెరికన్ ఆర్టిస్ట్ ఎకోన్‌తో కలిసి.. రీసెంట్‌గానే ఓ రీమిక్స్ కూడా చేశాడు. ఇతని పాటలకు యూట్యూబ్‌లో 4.5 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇలా సింగర్‌గా ఎదుగుతున్న సమయంలోనే.. కోస్టా హఠాన్మరణం చెందడంతో, సంగీత లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. సోషల్ మీడియా మాధ్యమంగా అతని మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
3 Year Old Shoots Sister: బొమ్మ తుపాకీ అనుకొని.. అక్కనే కాల్చి చంపిన చిన్నారి