NTV Telugu Site icon

మెక్సికోను భ‌య‌పెడుతున్న సింక్ హోల్‌… చూస్తుండ‌గానే…

మెక్సికోలోని శాంటామారియా జెకాటేపెక్ లోని ఓ వ్య‌క్త‌కి చెందిన పోలంలో సింక్ హోల్ ఏర్ప‌డింది.  ఆ సింక్ హోల్ క్ర‌మంగా పెద్ద‌దిగా మారుతూ ఇప్పుడు ఫుట్‌బాల్ గ్రౌండ్ అంత పెద్ద‌దిగా మారిపోయింది.  ఈ సింక్‌హోల్ కు అనుకొని ఓ ఇల్లు కూడా ఉండ‌టంతో ఆ ఇంట్లోని వ్య‌క్తుల‌ను ఇప్ప‌టికే ఖాళీ చేయించారు.  నాలుగు రోజుల క్రితం ఆ హోల్‌లో రెండు పెంపుడు కుక్క‌లు కూడా ప‌డిపోయాయి.  వాటిని ర‌క్షించాల‌ని స్థానికుడు డిమాండ్ చేస్తున్నారు.  కానీ, ర‌క్షించ‌డం కుద‌ర‌ద‌ని అధికారులు చెబుతున్నారు.  కొన్నిరోజుల క్రితం చిన్న‌దిగా ఏర్ప‌డిన ఈ సింక్ హోల్ క్ర‌మంగా పెరుగుతూ వ‌చ్చింది.  ఈ సింక్ హోల్ ఇంకా పెరిగితే గ్రామాన్ని ఖాళీ చేయాల్సి వ‌స్తుంద‌ని స్థానికులు అవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.