Site icon NTV Telugu

Dubai Sand Plot: రికార్డ్ ధరకి ఇసుక ప్లాట్.. ఓనర్‌కి 242% లాభం

Dubai Sand Plot

Dubai Sand Plot

Sand Plot In Dubai Sold For Record Price: బాగా డబ్బున్న బడా బాబుల కంటికి ఏదైనా అందమైన భవనం, విలాసవంతమైన పెంట్‌హౌస్, పురాతన భవనాలు లేదా వస్తువులు కనిపిస్తే.. కోటాను కోట్లు పెట్టి, వాటిని కొనుగోలు చేస్తుంటారు. పెయింటింగ్‌లపై కూడా ఎన్నో కోట్లు వెచ్చించడాన్ని మనం చూశాం. కానీ.. ఒక వ్యక్తి మాత్రం కేవలం ఇసుక ప్లాట్ కోసం ఏకంగా 34 మిలియన్ డాలర్లు (మన ఇండియన్ కరెన్సీలో రూ.279 కోట్లు) ఖర్చు చేశాడు. భూతల స్వర్గంగా పేరొందిన దుబాయ్‌లో ఒక ఇసుక ప్లాట్‌ని అమ్మకానికి పెట్టగా.. ఓ కొనుగోలుదారు దాన్ని 125 మిలియన్ దిర్హామ్‌లకు సొంతం చేసుకున్నాడు. దీంతో.. ఇది యూఏఈలో విక్రయించబడిన అత్యంత ఖరీదైన ఫ్లాట్‌గా చరిత్రపుటలకెక్కింది. ఇంతకుముందు.. యూఏఈలోని ఒక ల్యాండ్ 91 మిలియన్ దిర్హామ్ (24 మిలియన్ డాలర్స్) అమ్ముడుపోయి.. అత్యంత ఖరీదైన ఫ్లాట్‌గా ఉండేది. ఇప్పుడు ఆ రికార్డ్ బద్దలైంది. జుమైరా సముద్ర తీరంలో ఉన్న ఆ ఇసుక ప్లాట్ విస్తీర్ణం 24,500 చదరపు అడుగులు. ఈ స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలు వెల్లడి కాలేదు కానీ.. ఫ్యామిలీ వెకేషన్ కోసం అక్కడ ఒక మ్యాన్షన్ నిర్మించాలన్న ఉద్దేశంతో ఆ ఇసుక ప్లాట్‌ని అతడు కొన్నట్లు వెల్లడైంది.

David Warner: డేవిడ్ వార్నర్‌కి ఊహించని షాక్.. మళ్లీ రిపీటైతే నిషేధమే!

రెండు సంవత్సరాల క్రితం.. అంటే 2021లో ఈ ఇసుక ప్లాట్‌ను ఉమర్ కమానీ అనే వ్యక్తి 36.5 మిలియన్ దిర్హామ్‌లకు కొనుగోలు చేశాడు. అక్కడ ఒక విలాసవంతమైన భవనం నిర్మించాలన్న ఉద్దేశంతో అతడు దాన్ని సొంతం చేసుకున్నాడు. కానీ.. తన ప్లాన్స్ వర్కౌట్ కాకపోవడంతో, ఆ ప్లాట్‌ని అమ్మకానికి పెట్టాడు. నైట్ ఫ్రాంక్ బ్రోకరేజ్ సంస్థకు అతడు ఈ ప్లాట్ అమ్మే బాధ్యతల్ని అప్పగించాడు. ఈ సంస్థ ద్వారా కొనుగోలుదారుడు.. ఆ ఇసుక ప్లాట్‌ను రికార్డ్ ధరకి కొనుగోలు చేశాడు. దీంతో.. ఈ స్థలం ఓనర్‌కి, అంటే ఉమర్ కమానీకి 242 శాతం లాభం వచ్చింది. ఈ అమ్మకంపై నైట్ ఫ్రాంక్ సంస్థలోని ప్రైమ్ రెసిడెన్షియల్ హెడ్ ఆండ్రూ కమ్మింగ్స్ మాట్లాడుతూ.. ‘‘34 మిలియన్ డాలర్ల రియల్ ఎస్టేట్ డీల్‌తో దుబాయ్‌లో ఒక అద్భుతమైన పెంట్ హౌస్ గానీ, రాజభవనాన్ని గానీ సొంతం చేసుకోవచ్చు. కానీ.. ఇక ఇసుక ప్లాట్ ఈ రేంజ్ ధర పలకడం నిజంగా ఆశ్చర్యకరం. ఆ ప్లాట్‌లో డ్రీమ్ హోమ్ నిర్మించుకోవచ్చు’’ అంటూ ఒక స్టేట్‌మెంట్‌లో చెప్పుకొచ్చాడు. కాగా.. నిజానికి ఇసుక ప్లాట్లు ఇంత ధరకి అమ్ముడుపోవు. విలాసవంతమైన భవనాలకే అక్కడ గిరాకీ ఎక్కువ. తొలిసారి ఒక ఇసుక ప్లాట్ ఇంత ధరకి అమ్ముడుపోవడంతో.. ఇది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Alcohol Consuming Coutries: ఈ దేశాల్లో మందుబాబులు ఎక్కువ

అయినా.. ఒక ఇసుక ప్లాట్‌కి అంత అమౌంట్ పెట్టాల్సిన అవసరం ఏంటి? అనే అనుమానం మీకు రాకపోవచ్చు. యూఏఈలో పన్ను శాతం చాలా తక్కువ. అక్కడ ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే.. అంతే ట్యాక్స్ తగ్గుతూ వస్తుంది. ఇదే పెట్టుబడిదారుల్ని ఆకర్షిస్తోంది. ట్యాక్స్ తక్కువగా ఉండటం వల్లే.. బడా బాబులందరూ అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఎగబడుతున్నారు. దీనికితోడు చమురు ధరలు సైతం చాలా తక్కువగా ఉండటంతో.. దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది.

Exit mobile version