NTV Telugu Site icon

China: టెస్టు రన్ ఫెయిల్యూర్.. అడవుల్లో కూలిన రాకెట్

Rocket

Rocket

చైనాలో ఓ ప్రైవేటు రాకెట్ కుప్పకూలింది. ప్రయోగం ప్రారంభం అయిన కొన్ని క్షణాల్లో నిప్పులు చిమ్ముకుంటూ సమీప అడవుల్లో కుప్పకూలింది. ఆదివారం చైనీస్ టియాన్‌లాంగ్-3 రాకెట్ సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో ప్రయోగం చేపట్టారు. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే ప్రయోగం ఫెయిల్యూర్ అయింది. అంతరిక్షంలోకి వెళ్లక ముందే 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై కూలిపోయింది.

ఇది కూడా చదవండి: Kona Ravikumar: స్వయంగా పింఛన్ దారుల వద్దకు వెళ్లిన మొద్దమొదటి సీఎం చంద్రబాబు..

రాకెట్ బాడీ.. టెస్ట్ బెంచ్ మధ్య కనెక్షన్‌లో నిర్మాణ వైఫల్యం కారణంగానే ప్రయోగం విఫలమైందని చైనాకు చెందిన డెవలపర్ మరియు ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ పయనీర్ చెప్పారు. రాకెట్‌లోని కంప్యూటర్‌ కూడా పని చేయకపోవడంతో రాకెట్ కూలిపోయిందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Qantas Flight: ఫ్లైట్‌లో అస్వస్థత.. ప్రాణాలు విడిచిన భారత సంతతి యువతి

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రాకెట్ 30 సెకన్లు గాల్లోకి ఎగిరి కూలిపోయినట్లుగా తెలిపారు. ఆ తర్వాత పల్టీలు కొట్టుకుంటూ కింద పడి పోయిందని పేర్కొన్నారు. ప్రయోగ కేంద్రానికి నైరుతి దిశలో 1.5 కిలోమీటర్ల దూరంలో కూలిపోయింది. పేలుడు కారణంగా ఎవరూ గాయపడలేదని చైనా మీడియా, స్పేస్ పయనీర్ వెల్లడించాయి.

ఇది కూడా చదవండి: Akhil – Agent : టీవీ ప్రీమియర్ కి రెడీ అయిపోయిన అఖిల్ “ఏజెంట్”.. కాకపోతే..