NTV Telugu Site icon

నైజీరియాలో ఘోర ప్ర‌మాదంః 18 మంది మృతి…

నైజీరియాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.  రెండు బ‌స్సులు ఢీకొన‌డంతో 18 మంది మృతి చేందారు.  ప‌లువురికి తీవ్ర‌మైన గాయాల‌య్యాయి.  నైజీరియాలోని జిగువా ప్రాంతంలో ఎదురెదురుగా వ‌స్తున్న రెండు బస్సులు డీకొన‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.  రోడ్లు అద్వాన్నంగా ఉండ‌టం, బ‌స్సుల్లో ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండ‌టంతో త‌ర‌చుగా ప్ర‌మాదాలు జరుగుతున్నాయి.  ప్ర‌మాదానికి రాష్ డ్రైవింగ్ కార‌ణం అయి ఉండోచ్చ‌ని అధికారులు చెబుతున్నారు.  ఈ ప్ర‌మాదంలో ఓ బ‌స్సు డ్రైవ‌ర్ కాలు విరిగిపోయింది.  ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన కుటుంబాల‌కు అ దేశ ప్ర‌ధాని సంతాపం తెలియ‌జేశారు.  ఆ కుటుంబాల‌ను ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. 

Show comments