Site icon NTV Telugu

Qantas flight: విమానంలో 100 మందికి పైగా ప్రయాణికులు.. నడిసముద్రంపై ఉండగా సాంకేతిక లోపం..

Qantas Flight

Qantas Flight

Qantas flight: నేపాల్‌లో జరిగిన విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది.. అయితే, ఆ ఘటన నుంచి ఇంకా తేరుకోక మునుపే.. పెను ప్రమాదం నుంచి ఓ విమానం బయటపడింది.. వంద మందికి పైగా ప్రయాణికులతో బయల్దేరిన ఓ విమానం.. నడి సముద్రంపై ఉన్న సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.. అయితే, ఆ తర్వాత ఆ విమానం సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. ఈ విమాన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. న్యూజిలాండ్‌లోని క్వాంటాస్‌కు చెందిన విమానం ప్రమాద సంకేతాన్ని జారీ చేయడంతో సిడ్నీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో సిడ్నీలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు..

Read Also: Devineni Uma: అన్ని పార్టీలకు ఎన్టీఆర్ ఆశయాలే అజెండా..

న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌ నుంచి సిడ్నీకి బయల్దేరింది క్వాంటాస్‌ విమానం క్యూఎఫ్‌144… అయితే, అది పసిఫిక్‌ సముద్రంపై ప్రయాణిస్తున్న సమయంలో.. బోయింగ్ 737 దాని రెండు ఇంజన్‌లలో ఒకదానిలో సాంకేతిక సమస్యలు వచ్చాయి.. ఇది ట్విన్‌ ఇంజిన్‌ బోయింగ్‌ 737-800 మోడల్‌ విమానం. ఈ విమానంలో దాదాపు 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. పరిస్థితిని అర్థం చేసుకొన్న ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ మేడే అలర్ట్‌ జారీ చేసింది. సాధారణంగా ప్రాణాంతకమైన పరిస్థితుల్లో వైమానిక రంగంలో ఈ అలర్ట్‌ జారీ చేస్తుంటారు.. దాదాపు 45 నిమిషాల ముందు ఈ అలర్ట్‌ జారీ అవ్వడంతో.. విమానంలోని ప్రయాణికులు సిబ్బంది అంతా ఆందోళనకు గురయ్యారు.. సిడ్నీకి మరో గంటలో చేరుకుంటుందన్న సమయంలో.. ఈ హెచ్చరికలు ఎదుర్కోవాల్సి వచ్చిందని.. ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌కి ఒక ప్రకటనలో పేర్కొంది.. తీవ్రమైన మరియు ఆసన్నమైన ప్రమాదాన్ని సూచించే మేడే సిగ్నల్ ల్యాండింగ్‌కు ముందు “సాధ్యమైన సహాయం అవసరం” కోసం డౌన్‌గ్రేడ్ చేయబడింది.. దీంతో.. విమానం సిడ్నీలో ల్యాండ్ అయ్యే సమయానికి ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని అందుబాటులో ఉంచారు.. న్యూ సౌత్ వేల్స్ అంబులెన్స్ దాని పారామెడిక్స్ హెచ్చరికకు స్పందించినట్లు ధృవీకరించింది.. మొత్తంగా ఆ విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయ్యిందని.. అదులోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్టు చెబుతున్నారు.. విమానంలోని సాంకేతిక సమస్యలను ఇంజనీర్లు అంచనా వేసిన తర్వాత మరింత సమాచారాన్ని పంచుకుంటామని క్వాంటాస్ పేర్కొంది.

Exit mobile version