PM Modi Attend Shinzo Abe Funeral: మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియల కోసం నరేంద్ర మోడీ టోక్యో వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో అక్కడకు వెళ్లిన మోడీ జపాన్ మాజీ ప్రధాని షింజో అబేతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబే మరణం విషాదకరమని, ముఖ్యంగా తనకు వ్యక్తిగతంగా తీరని లోటన్నారు. అయితే.. గతంలో తాను జపాన్ కు వచ్చినప్పుడు చాలా సమయం మాట్లాడకున్నామని అన్నారు.
అబే భారత్- జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరో ఎత్తుకు తీసుకెళ్లారన్న మోడీ.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మైత్రి బలోపేతానికి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ఇక, ప్రస్తుత ప్రధాని ఫ్యుమియో కిషిద సైతం అదే తీరును కొనసాగిస్తారనే నమ్మకం తనకు ఉందని మోడీ చెప్పారు. అయితే.. మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియల కోసం టోక్యో వెళ్లిన ప్రధాని మోడీ.. జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదతో సమావేశమయ్యారు. ఈనేపథ్యంలో.. పలు అంశాలపై చర్చలు జరిపారు. కాగా, అబే అంత్యక్రియల కోసం జపాన్ కు వచ్చిన నరేంద్ర మోడీకి కిషిద ధన్యవాదాలు తెలిపారు. మేలో జరిగిన క్వాడ్ సమ్మిట్ లో పాల్గొన్న మోడీ, కిషిదతో సమావేశమయ్యారు.
జపాన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం ప్రధానిగా పనిచేసిన అబే, గత నెల హత్యకు గురయ్యారు. అబే నరా నగరంలోని ఓ వీధిలో లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. ఓ దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. దీంతో అబే ఛాతీ పట్టుకుని వేదికపైనే కుప్పకూలారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు కూడా ఇవాళ ముగిశాయి.
Virat Kohli: ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టిన కింగ్ కోహ్లీ
