NTV Telugu Site icon

End Of The Earth: భూమి ఇలాగే అంతం అవబోతోందా..? చనిపోతున్న ఈ గ్రహమే ఉదాహరణ

Death Of The Earath

Death Of The Earath

End Of The Earth: విశ్వంలో ప్రతీదానికి పుట్టుక, మరణం అనేది ఉంటుంది. ఏదో రోజు మన సౌరవ్యవస్థకు మూలం అయిన సూర్యుడు కూడా చనిపోతాడు. అయితే దీనికి కొన్ని బిలియన్ ఏళ్ల సమయం పడుతుంది. అయితే ఆ సమయంతో భూమి కూడా అంతం అవుతుంది. అయితే చివరి రోజుల్లో భూమి అంతం ఎంతటి దారుణంగా ఉంటుంది అనే విషయాన్ని శాస్త్రవేత్తలు అంచానా వేస్తున్నారు. అయితే అందుకు ఓ ఉదాహరణ లభించింది.

వృద్ధాప్యంలో ఉన్న సూర్యుడు వంటి నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఓ గ్రహం తన మాతృ నక్షత్రాన్ని ఢీకొట్టేందుకు వెళ్తున్నాడు. ఇలాగే భూమి అంతం ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సోమవారం ప్రచురించిన ఓ అధ్యయనంలో ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు వివరించారు. ఎక్సోప్లానెట్ కెప్లర్-1658బీ తన మాతృనక్షత్రాన్ని త్వరలోనే ఢీకొడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సరిగ్గా ఈ గ్రహానికి ఎదురయ్యే పరిస్థితులే చివరి రోజుల్లో మన భూమికి కూడా ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

Read Also: LPG Cylinder Price: ఆ రాష్ట్రంలో సగం ధరకే గ్యాస్ సిలిండర్.. సీఎం కీలక నిర్ణయం.

భూమికి 2600 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కెప్లర్ -1658బీని ‘‘హాట్ జూపిటర్’’ గా అభివర్ణిస్తారు. మన గురు గ్రహం పరిమాణంలో ఉండే ఈ గ్రహం, తన నక్షత్రం నుంచి కేవలం సూర్యుడు, బుధుడికి ఉన్న దూరంలో 8వ వంతు దూరంలోనే ఉంది. దీంతో ఆ గ్రహంపై తీవ్రమైన వేడి ఉంటుంది. కెప్లర్ -1658బీ తన నక్షత్రం చుట్టూ తిరిగి రావడానికి కేవలం మూడు రోజుల కన్నా తక్కువ సమయం తీసుకుంటోంది. అయితే ఇది ప్రతీ ఏడాది 131 మిల్లీ సెకన్లు తగ్గుతోంది. ఇదే విధంగా తిరిగితే.. మరో మూడు మిలియన్ ఏళ్లలో దాని నక్షత్రాన్ని ఢీకొట్టి అంతం అవుతుందని హర్వర్డ్ స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ అధ్యయనంలో వెల్లడించింది.

ప్రస్తుత కెప్లర్-1658బీ తిరుగుతున్న నక్షత్రం, తన జీవిత చరమాంకంలోని ‘సబ్ జాయింట్’ స్థితిలో ఉంది. దీంతో అది పెద్దగా మారుతూ.. ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అయితే కెప్లర్-1658బీ కక్ష్య సముద్రంలో అలల మాదిరిగా ప్రతీ రోజు తగ్గతూ, పెరుగుతోందని తేలింది.

‘‘డెత్ బై స్టార్’’ అనేది విధి. సూర్యుడి వయసు పెరుగున్నా కొద్ది భూమి ఆయువు తగ్గుతుంటుంది. కొన్ని బిలియన్ల తరువాత మన సూర్యుడే, సమస్త జీవజాలానికి నివాసంగా ఉన్న భూమిని కబలిస్తాడు. సూర్యుడు రెడ్ సూపర్ జాయింట్ గా మారుతాడు. సూర్యుడి పరిమాణం అంతకంతకు పెరుగుతూ.. భూమి వరకు వస్తాడు. ఇది జరగడానికి సుమారు 5 బిలియన్ ఏళ్లు పడుతుందని అంచానా.