Site icon NTV Telugu

Pilots Fall Asleep: 37 వేల అడుగుల ఎత్తులో విమానం.. నిద్రలో పైలెట్లు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Ethiopian Airlines

Ethiopian Airlines

Pilots Fall Asleep At 37,000 Feet: విమానాలు నడిపేటప్పుడు పైలెట్లు, ఇతర క్రూ ఎంతో అలర్ట్ గా ఉంటారు. ఆకాశంలో ఏదైనా నిర్లక్ష్యానికి తావిచ్చినా.. భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు విమాన ప్రమాదాలు హ్యమన్ ఎర్రర్స్ తోనే జరుగుతుంటాయి. విమాన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పైలెట్లు నిద్రపోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం సుడాన్ లోని ఖార్టూమ్ నుంచి ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాకు విమానాన్ని నడుపుతుండగా ఈ ఘటన జరిగింది. ఇద్దరు పైలెట్లు కూడా నిద్రలోకి జారుకున్నారు. విమానం దాదాపుగా 37,000 అడుగుల ఎత్తులో అంటే దాదాపుగా 11 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా.. ఇద్దరు పైలెట్లు కూడా నిద్రపోయారు. విమానం ఆ సమయంలో ఆటో పైలెట్ మోడ్ లో ఉంది.

Read Also: National Family Health Survey: పురుషుల కన్నా స్త్రీలకే ఎక్కువ సెక్స్ పార్ట్నర్స్..11 రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి

అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఎంతగా పైలెట్లను సంప్రదించాలని ప్రయత్నించినా.. పైలెట్లు రెస్పాండ్ కాలేదు. అయితే విమానం ఎయిర్ పోర్ట్ రన్ వే దగ్గరకు చేరుకోవడంతో ఆటో పైలెట్ డిస్ కనెక్ట్ అయింది. దీంతో ఫ్లైట్ లో అలారం పైలెట్లను అలర్ట్ చేసి ఉంటుందని ఏవియేషన్ నిపుణులు భావిస్తున్నారు. దీంతో దిగాల్సిన ఎయిర్ పోర్ట్ రన్ వేను విమానం మిస్ అయింది. పైలెట్లు చుట్టూ తిప్పుకుని వచ్చి 25 నిమిషాల తర్వాత విమానాన్ని ల్యాండ్ చేశారు. అయితే విమానం బయలుదేరడానికి ముందు 2.5 పాటు లేట్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదని.. ఈ ప్రమాదానికి పైలెట్ల అలసట కారణం అని నిపుణులు భావిస్తున్నారు. గత మే నెలలో న్యూయార్క్ నుంచి రోమ్ వెళ్లే విమానం 38 వేల అడుగుల ఎత్తులో ఉండగా.. ఇద్దరు పైలెట్లు నిద్రలోకి జారుకున్నారు. సరిగ్గా ఇదే విధంగా ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ లో జరిగింది.

Exit mobile version