NTV Telugu Site icon

12-15 ఏళ్ల పిల్ల‌ల‌కు వ్యాక్సిన్‌.. అక్క‌డ గ్రీన్ సిగ్న‌ల్

Pfizer

భార‌త్‌ను సెకండ్ వేవ్ కుదిపేసింది.. ఇప్పుడు థ‌ర్డ్ వేవ్ ముప్పు కూడా పొంచిఉంద‌ని.. అది పిల్ల‌ల‌పైనే ఎక్కువ ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌నే హెచ్చ‌రిక‌లు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు కొన్ని దేశాలు పిల్ల‌ల‌కు కూడా వ్యాక్సిన్ ఇచ్చే ప‌నిలో ప‌డ్డాయి… బ్రిట‌న్‌కు చెందిన మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రోడ‌క్ట్స్ రెగ్యులేట‌రీ ఏజెన్సీ.. తాజాగా, 12 నుంచి 15 ఏళ్ల వ‌య‌సు పిల్ల‌ల‌కు ఫైజ‌ర్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమ‌తి ఇచ్చింది.. ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష నిర్వ‌హించిన త‌ర్వాతే ఈ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు ఆ ఏజెన్సీ చీఫ్ జూన్ రెయిన్ ప్ర‌క‌టించారు.. ఇప్ప‌టి వ‌ర‌కు 12 నుంచి 15 ఏళ్ల పిల్ల‌ల‌పై నిర్వ‌హించిన క్లినిక‌ల్ ట్ర‌య‌ల్ డేటాను క్షుణ్నంగా ప‌రిశీలించామ‌ని.. ఫైజ‌ర్‌-బ‌యోఎన్‌టెక్ క‌రోనా వ్యాక్సిన్ ఈ వ‌య‌సు పిల్ల‌ల‌కు పూర్తి సుర‌క్షిత‌మ‌ని గుర్తించిన‌ట్టు బ్రిట‌న్ ప్ర‌క‌టించింది.. ఇక‌, డిసెంబర్‌లో వ్యాక్సినేష‌న్‌ డ్రైవ్ ప్రారంభించింది బ్రిటన్… సగం మందికి పైగా పెద్ద‌వారికి ఇప్ప‌టికే రెండో డోసు టీకాలు కూడా వేశారు.. ప్రధానంగా ఫైజర్ లేదా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల‌ను వాడారు.. మ‌రోవైపు పెద్ద‌వారిలో మూడొంతుల మందికి క‌న‌సీం ఒక్క డోసైనా ఇచ్చామ‌ని చెబుతున్నారు..