Site icon NTV Telugu

పిల్లలకి వ్యాక్సిన్‌.. ఆ టీకా 91 శాతం సమర్థంగా పనిచేస్తోంది..!

కరోనాపై పోరాటంలో భాగంగా ఇప్పటికే ఎన్నోరకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ నడుస్తోంది. ఈ మధ్యే భారత్‌ 100 కోట్ల డోసుల మార్క్‌ను కూడా క్రాస్‌ చేసి రికార్డు సృష్టించింది.. మరోవైపు.. చిన్నారులకు వ్యాక్సిన్లపై కూడా ట్రయల్స్‌ నడుస్తున్నాయి. అమెరికాకు చెందిన ఫైజర్‌ సంస్థ కూడా పిల్లలకు వ్యాక్సిన్‌లో ముందు వరుసలో నిలిచింది.. ఆ సంస్థ అభివృద్ధి చేసిన కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ 5–11 ఏళ్ల వయసు వారిలో 91 శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. పిల్లలకి కూడా ఈ వ్యాక్సిన్‌ అత్యంత సురక్షితమని తేల్చింది..

కాగా, ఇప్పటికే 12 ఏళ్ల పైబడిన వారికి యూఎస్‌లో వ్యాక్సినేషన్‌ జరుగుతోంది.. ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల వయసు వారికి నవంబర్‌ నుంచి వ్యాక్సినేషన్‌కు అగ్రరాజ్యం ప్రయత్నాలు చేస్తోంది… ఇక, క్రిస్మస్‌ నాటికి కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెబుతోంది జో బైడెన్‌ ప్రభుత్వం. చిన్నారులకు ఫైజర్‌ వ్యాక్సిన్‌కి సంబంధించిన తాజా అధ్యయనం వివరాలను ఆన్‌లైన్‌ ఉంచగా.. అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ దీనిపై మరోసారి సమీక్ష చేసి.. సిఫారసు విషయంపై తేల్చనుంది..

Exit mobile version