Passenger Gives Birth On Emirates Flight From Tokyo To Dubai: విమానం గాల్లో ఉన్నప్పుడు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే.. అప్పుడు వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే.. అత్యవసర ల్యాండింగ్ కావాల్సి ఉంటుంది. కానీ.. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో అందుకు భిన్నంగా ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉన్నప్పుడే ఓ మహిళా ప్రయాణికురాలికి హఠాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయకుండానే, గగతనంలో ఆమె విమానంలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. నిజానికి.. డెలివరీ దగ్గర పడిన గర్భిణీలకు విమానంలో ప్రయాణించడానికి అనుమతి ఉండదు. అయితే.. ఇక్కడ ఆ మహిళ ప్రత్యేక పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వచ్చింది.
Bryan Johnson: 45 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు రివర్స్ గేర్.. ఎంత ఖర్చో తెలుసా?
ఆ వివరాల్లోకి వెళ్తే.. జనవరి 19వ తేదీన టోక్యో నరిటా నుంచి దుబాయ్‌కి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈకే 319 విమానం బయలుదేరింది. ఈ విమానంలో ఓ గర్భిణీ కూడా ఎక్కింది. విమానం టేకాఫ్ అయి, గాల్లో కాసేపు తేలేంతవరకు పరిస్థితులు బాగానే ఉన్నాయి. కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆ గర్భిణీకి పురిటినొప్పులు మొదలయ్యాయి. ఆ సమయంలో పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నించారు. మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించారు. అయితే.. ఎంత ఎమర్జెన్సీ అయినప్పటికీ షెడ్యూల్ ప్రకారమే ల్యాండ్ కావాలి. ఇంతలో ఆ గర్భిణీ ప్రసవ వేదనకు గురవ్వగా.. విమాన సిబ్బంది సమయస్ఫూర్తిగా, చాకచక్యంగా వ్యవహరించింది. దీంతో.. ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. విమానశ్రయంలో దిగేసరికి వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని ఎమిరేట్స్ ప్రకటించింది.
Delhi Mayor Election: ఢిల్లీ మేయర్ ఎన్నికలు.. పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ఆప్
కాగా.. విమాన ప్రయాణాల్లో ఇలా డెలివరీ జరిగిన ఘటనలు ఇదేం కొత్త కాదు. ఇంతకుముందే ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. గతేడాది మే నెలలో డెన్వర్ నుంచి కొలరాడోకు వెళ్తున్న ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానంలో.. ఓ ప్రయాణికురాలు ఓ బిడ్డకు జన్మించింది. ఈ నెలలోనే ఘనా నుంచి వాషింగ్టన్ వెళ్తున్న ఓ విమానంలోనూ.. ఆరు గంటల ప్రసవవేదన తర్వాత ఎమర్జెన్సీ ఎగ్జిట్ వద్ద ఉండే క్యాబిన్ ఫ్లోర్‌పై బిడ్డకు జన్మనిచ్చింది.