Site icon NTV Telugu

Pakistan: ప్రపంచానికి పట్టిన చీడ పాకిస్తాన్.. ఆఫ్రికా ఉగ్ర సంస్థలకు శిక్షణ..

Boko Haram

Boko Haram

Pakistan: ప్రపంచానికి చీడ పురుగుగా పాకిస్తాన్ మారింది. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద సంఘటన జరిగినా, దాని మూలాలు పాకిస్తాన్‌లో కనిపిస్తాయి. అల్ ఖైదాతో పాటు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సహా అనేక ఉగ్రవాద సంస్థలకు పాక్ గడ్డపై నుంచి కార్యకలాపాలకు పాల్పడుతుంటాయి. ఇండియాపైకి ఉగ్రవాదుల్ని ఉసిగొల్పుతున్నాయి. ఒక్క భారతదేశం మాత్రమే కాకుండా, ప్రపంచంలోనే పలు ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఉగ్రవాదులు శిక్షణ ఇస్తున్నారు.

Read Also: Drug Peddlers Arrested: కూకట్‌పల్లిలో డ్రగ్స్.. ఏపీకి చెందిన ఆరుగురు అరెస్ట్

తాజాగా, ఆఫ్రికాలోని కరుడుగట్టిన తీవ్రవాద సంస్థ బోకో హరామ్, ఐఎస్ఐఎస్ లో లింకులు ఉన్న ISWAPలకు పాక్ జాతీయులు శిక్షణ ఇస్తున్నట్లు తేలింది. నలుగురు పాకిస్తాన్ జాతీయులను నైజీరియా సైన్యం అరెస్ట్ చేసింది. వీరు ఉగ్రవాదులకు ఆయుధాల అక్రమ రవాణాలో కూడా సహకరించారు. దీంతో పాటు ఆఫ్రికా ఉగ్ర సంస్థలకు ప్రమాదకరమైన దాడులు చేయడం, గూఢచర్యం, డ్రోన్ శిక్షణ వంటిని నేర్పిస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ కిరాయి సైనికులు ఉగ్రవాదులకు వ్యూహాత్మక నైపుణ్యాలను నేర్పుతున్నట్లు తేలింది.

Exit mobile version