Site icon NTV Telugu

Viral Video: విమానం విండ్‌స్క్రీన్‌ క్లీన్ చేసిన పైలెట్.. వీడియో వైరల్

Viralvideo

Viralvideo

పాకిస్థాన్‌లో విమానం విండ్‌స్క్రీన్‌‌ను పైలెట్ క్లీన్ చేసిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైలర్ అవుతున్నాయి. టేకాప్‌కు ముందు ఎయిర్‌పోర్టులో విమానం ఆగి ఉండగా పైలెట్ కిటికీలోంచి బయటికి వచ్చి విండ్‌స్క్రీన్‌ను శుభ్రం చేశాడు. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

ఇది కూడా చదవండి: AP Floods : ఏపీ వరదలు.. సీఎం రిలీఫ్ ఫండ్ కు వైజయంతీ మూవీస్ భారీ విరాళం

పాకిస్తాన్‌కు చెందిన ఈ ఎయిర్‌లైన్.. సౌదీ అరేబియాలోని జెడ్డా మధ్య అంతర్జాతీయ విమానాన్ని నడుపుతోంది. ఎయిర్‌బస్ A330-200లో ఈ సంఘటన జరిగిందని స్థానిక మీడియా తెలిపిండి. పైలట్‌లు ఇటువంటి పనులను చేయడం అసాధారణం. అయితే ఈ వీడియో ఎయిర్‌లైన్ భద్రతా ప్రోటోకాల్‌లు మరియు గ్రౌండ్ స్టాఫ్ విధుల గురించి సంభాషణకు దారితీసింది. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలైన కామెంట్లు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి కేసులో కీలక పరిణామం.. కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్‌ఘోష్‌ అరెస్ట్..

Exit mobile version