పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి ఊడిపోవడం దాదాపు ఖాయం అయినట్టు పరిస్థితులు చెబుతున్నాయి… ఇప్పటికే ఆయనపై దిగువ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. ఇవాళ చర్చ ప్రారంభంకానుంది… చర్చ తర్వాత ఓటింగ్‌కు వెళ్లనున్నారు.. అయితే, అవిశ్వాస తీర్మానంపై చర్చకు ముందు సంచలన ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తనపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటే.. తాను పార్లమెంట్‌ను రద్దు చేస్తానని ప్రకటించారు.. ఈ విషయాన్ని ప్రతిపక్ష నేత షహబాజ్ షరీఫ్‌కు చేరవేసింది ఇమ్రాన్ ఖాన్ టీమ్… అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభానికి ముందు సమావేశమైన ప్రతిపక్షాలు.. తాజా పరిస్థితులపై చర్చించాయి.. ఇదే సమయంలో ఇమ్రాన్ ఖాన్ ఓ రహస్య లేఖ ద్వారా ఆ ఆఫర్‌ను వారి దృష్టికి తీసుకెళ్లారు.
Read Also: TS: దంచికొడుతున్న ఎండలు.. ఆ సమయంలో అవసరం అయితేనే బయటకు రండి..
దేశంలో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం తలెత్తిందని.. దీనికి విరుగుడు అదేనంటూ ఇమ్రాన్ ఖాన్ తన సందేశాన్ని చేరవేశారు.. ఇదే సమయంలో.. తన ప్రతిపాదనకు అంగీకరించని పక్షంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు ఇమ్రాన్ ఖాన్. మరోవైపు.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనపై అవిశ్వాస తీర్మానానికి ముందు ఈ సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని మంత్రి ఫవాద్ చౌదరి గురువారం తెలిపారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు అని ట్వీట్ చేశారు..