Earthquake: ఐస్‌లాండ్ రాజధాని రేక్‌జావిక్ పరిసర ప్రాంతాల్లో నిన్న ఒక్క రోజే దాదాపుగా 1600 భూ ప్రకంపాలు నమోదు అయ్యాయని ఆ దేశ వాతావరణ కార్యాలయం బుధవారం వెల్లడించింది. అగ్నిపర్వతం విస్పోటనం జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. స్థానిక కాలమాన ప్రకారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అగ్నిపర్వత వ్యవస్థపై ఉన్న మౌంట్ ఫాగ్రాడాల్స్‌ఫ్జల్ క్రింద ప్రకంపనలు ప్రారంభమయ్యాయని అక్కడి వాతావరణ కేంద్రం తెలిపాయి. ఐస్ లాండ్ దేశంలో నైరుతి కొనలో ఉన్న రేక్‌జానెస్ ద్వీపకల్పంలో గత రెండేళ్లలో రెండు విస్పోటనాలు సంభవించాయి.
Read Also: Dengue Fever Alert: డెంగ్యూ, మలేరియా ముప్పు మొదలైంది.. నేటి నుంచే ఈ ఆహారపదార్థాలను తీసుకోండి
1600 ప్రకంపనలు సంభవిస్తే ఇందులో నాలుగు ప్రకంపనలు 4 కన్నా ఎక్కువ తీవ్రతతో సంభవించాయి. భూకంప కార్యకలాపాల వల్ల విమానయాన సర్వీసులకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మొత్తం యూరప్ లోనే ఐస్‌లాండ్ లో అత్యంత చురుకైన అగ్ని పర్వతం ఉంది. ఉత్తర అట్లాంటిక్ ద్వీపం ఆర్కిటిక్ సర్కిల్ కు సరిహద్దుల్లో ఉంది. ఇది యూరేషియన్, ఉత్తర అమెరికా టెక్టానిక్ ప్లేట్ వేరు చేసే ప్రాంతంలో ఈ అగ్నిపర్వతం ఉంది. 2021, 2022లో జరిగిన అగ్ని పర్వతం విస్పోటనాల్లో బయటకు వచ్చిన లావా దాదాపుగా ఫాగ్రాడల్స్‌ఫ్జాల్ పర్వతం వరకు వ్యాపించింది. ఇది రాజధాని రెక్జావిక్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్నిచూసేందుకు వేలాది మంది సందర్శకులు కూడా వచ్చారు. గతంలో ఈ అగ్నిపర్వత విస్పోటనం వల్ల విడుదలైన బూడిద ఆ ప్రాంతంలో వెళ్లే విమానాలపై తీవ్ర ప్రభావం చూపించింది.