Site icon NTV Telugu

ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్‌


ప్రపంచాన్ని కోవిడ్‌ కొత్త వేరింయట్‌ ఒమిక్రాన్‌ వణికిస్తుంది. ఇప్పుడిప్పుడే అన్ని సాధారణ స్థితికి వస్తున్న వేళ కొత్త వేరింయట్‌తో ఆయా దేశాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఊహించని విధంగా ఒమిక్రాన్‌ వ్యాపిస్తుంది. దాని లక్షణాలు తెలుసుకునే లోపే అది ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని తట్టుకుని వ్యాపిస్తున్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇతర దేశాల నుంచి భారత్‌ లోకి వచ్చినవారికి కోవిడ్‌ టెస్టులు చేయడంతో పాటు వారికి 14 రోజులు క్వారంటైన్‌ విధిస్తున్నారు. ఇప్పటికే ఎట్‌ రిస్క్‌ దేశాలను నుంచి వచ్చే వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఎయిర్‌ పోర్టు సిబ్బంది తెలిపారు. డెల్టా వేరింయంట్‌ కన్నా ఇది 30 రేట్లు వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే పలు దేశాలు అంతర్జాతీయ సరిహద్దులను మూసివేశాయి. ఇజ్రాయిల్‌, మొరాకో ఏకంగా సరిహద్దులనే మూసివేశాయి. ప్రపంచ వ్యాప్తంగా 159కి పైగా ఒమిక్రాన్‌ కేసులు. భయంతో టీకా కేంద్రాలకు పోటేత్తుతున్న అమెరికా వాసులు.

నెదర్లాండ్‌లో ఒక్కరోజే 13కుపైగా ఒమిక్రాన్‌ కేసులు నమోదుఅయ్యాయి. సౌతాఫ్రికాలో ఇప్పటి వరకు 107 కేసులు నమోదు అయ్యాయి. సౌతాఫ్రికా నుంచి విమాన రాకపోకలు రాకుండా 18 దేశాలు ఆంక్షలు విధించాయి. ఒమిక్రాన్‌ వేరింయంట్‌పై కేంద్రం కేబినేట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసింది. మహారాష్ర్ట లో సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. శాంపిల్స్‌ను జీనోమ్‌ స్వీక్వెన్స్‌ ల్యాబ్‌కు పంపించినట్టు ఎయిర్‌పోర్టు సిబ్బంది తెలిపింది. మన దేశంలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ పై అవగాహన కల్పిస్తున్న ఇప్పటికి వ్యాక్సిన్‌ తీసుకోని వారు ఉన్నారు. ఒకటో డోసు తీసుకుని రెండో డోసు తీసుకుని వారు ఇంకా ఉన్నారు. దీంతో కేంద్రం అప్రమత్తం అయింది. ప్రయాణికులకు ఎయిర్‌ పోర్టులోనే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు జరపాలని కేంద్రం రాష్ర్ట ప్రభుత్వాలకు సూచించింది.

ఒమిక్రాన్‌ కేసులు ఇప్పటి వరకు మన రాష్ర్టంలో ఇంకా నమోదు కాలేదని గాంధీ డిప్యూటీ సూపరిన్‌డెంట్‌ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త వేరింయట్‌ సింట్రమ్స్‌లో తేడాలు ఉన్నాయి. కాఫ్‌, కోల్డ్‌ లేదు. కానీ వెంటనే వీక్‌నెస్‌ అవుతున్నారు. అని ఆయన చెప్పారు. మన రాష్ర్టంలోకి వచ్చే వారిని వెంటనే కోవిడ్‌ టెస్టులు చేయాలనిచెప్పారు. రోగ నిరోధక శక్తిని కూడా ఈ కొత్త వేరింయంట్‌ ఎదుర్కొంటుంది. దీంతో బూస్టర్‌ డోస్‌లు వేయాలన్నా ప్రతిపాదన వస్తుంది. పెద్దగా భయపడాల్సిన పని లేదని ప్రజలు ఎవ్వరికి వారు అప్రమత్తంగా ఉండాలని గాంధీ డిప్యూటీ సూపరిన్‌డెంట్‌ పేర్కొన్నారు.

Exit mobile version