కరోనా సెకండ్ వేవ్ తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అంతా భావిస్తున్న తరుణంలో.. ఇప్పుడు కొత్త వేరియంట్ మళ్లీ గుబులు రేపుతోంది.. సౌతాఫ్రికాలో బయటపడిన బీ 1.1.529 ప్రపంచ దేశాలకు విస్తరిస్తూ.. కునుకు లేకుండా చేస్తోంది.. ఇప్పటి వరకు కరోనాలో వెలుగుచూసిన వేరియంట్ల కంటే.. ఇది అత్యంత ప్రమాదకరం అనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.. బీ.1.1.529ను ఆందోళనర వేరియెంట్‌గా గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఈ కొత్త వేరియెంట్‌కు ‘ఒమిక్రాన్’ అనే పేరు పెట్టింది..
Read Also: కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చెప్పులతో కొట్టండి..!
ఇక, అగ్రరాజ్యాన్ని మరోసారి భయపెడుతోంది ఈ కోవిడ్ కొత్త రూపం.. కేసుల సంఖ్య పెరుగుతండడంతో అమెరికాలోని న్యూయార్క్ లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు.. ఈ మేరకు న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ కాథీ హోచుల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇదే సమయంలో.. ఇప్పటివరకు న్యూయార్క్‌లో కొత్త వేరియంట్‌కు సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని స్పష్టం చేశారు. కానీ, ఇప్పటికే పలు దేశాల్లో ఒమిక్రాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని.. ముందు జాగ్రత్త చర్చల్లో భాగంగా హెల్త్ ఎమర్జెన్సీపై నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
