Earthquake: అమెరికాలో భూకంపం.. పలు ప్రాంతాల్లో ప్రకంపనలు

  • అమెరికాలో భూకంపం
  • పలు ప్రాంతాల్లో ప్రకంపనలు
  • రిక్టర్ స్కేల్‌పై 5.7గా నమోదు
Earthquake

Earthquake

అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో బలమైన భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.7గా నమోదైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. భూకంప కేంద్రం సిల్వర్ స్ప్రింగ్స్‌కు తూర్పు-దక్షిణ దిశగా సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అమెరికా భూగర్భ సర్వే (USGS) తెలిపింది.

ఇది కూడా చదవండి: Rajya Sabha: 17న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక.. రేసులో ఎవరున్నారంటే..!

భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. తక్కువ లోతులో భూకంపం సంభవించడంతో ప్రకంపనలు తీవ్రంగా కనిపించినట్లు సమాచారం. ముఖ్యంగా రెనో నగరం.. దాని పరిసర ప్రాంతాల్లోని నివాసితులు బెంబేలెత్తిపోయారు. రెనో నగరంలో భవనాలు స్వల్పంగా కంపించినట్లు తెలుస్తోంది. అయితే ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టంపై ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ తాజా వివరాలను సేకరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Siraj-Zanai Bhosle: జనై భోస్లేను దగ్గరకు తీసుకుని ఓదార్చిన మహమ్మద్ సిరాజ్.. వీడియో వైరల్