NTV Telugu Site icon

Monkeypox: స్పెయిన్ లో తొలి మంకీపాక్స్ మరణం.. యూరప్ లోనే మొదటి మరణం

Monkeypox

Monkeypox

Spain registers first monkeypox death: మంకీపాక్స్ కేసులు ప్రపంచాన్ని కలవర పెడుతున్నాయి. ఇప్పటికే 78 దేశాల్లో 18 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఎక్కువగా యూరోపియన్ దేశాల్లోనే వీటి తీవ్రత అధికంగా ఉంది. బ్రిటన్, స్పెయిన్, బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ తదితర యూరోపియన్ దేశాల్లో కేసుల సంఖ్య అత్యధికంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. యూరోపియన్ దేశాల్లో 70 శాతం కేసులు ఉన్నాయి. అమెరికాలో 25 శాతం కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇండిాయాలో కూడా మంకీపాక్స్ అనుమానిత కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే దేశంలో నలుగురికి మంకీపాక్స్ సోకింది.

ఇదిలా ఉంటే తాజాగా స్పెయిన్ దేశంలో తొలి మంకీపాక్స్ మరణం సంభవించింది. యూరప్ ఖండంలో ఇదే మొదటి మరణంగా భావిస్తున్నారు. ప్రస్తుతం యూరప్ లో మంకీపాక్స్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దేశాల్లో స్పెయిన్ ఒకటి. ఆ దేశంలో ఇప్పటి వరకు 4298 మంది వ్యాధి బారిన పడ్డారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం స్పెయిన్ లో 3750 మంది మంకీపాక్స్ బాధితుల్లో 120 మంది చికిత్స పొందుతుండగా.. ఒకరు మరణించారు. ఆఫ్రికా ఖండం వెలువల సంభవించిన రెండో మరణంగా దీన్ని చెప్పవచ్చు. అంతకుముందు బ్రెజిల్ లో మంకీపాక్స్ తో ఓ వ్యక్తి మరణించాడు.

Read Also: OPPO Company: చైనా కంపెనీ ‘ఒప్పొ’ చూపు.. ఇండియా వైపు. రూ.475 కోట్ల పెట్టుబడి

యూరప్ లో బెల్జియం, స్పెయిన్ లో జరిగిన రెండు రేవ్ పార్టీలే వివిధ దేశాల్లో మంకీపాక్స్ వ్యాపించడానికి కారణం అని అంతా భావిస్తున్నారు. ఆ పార్టీ తరువాత నుంచే యూరోపియన్ దేశాల్లో కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇదిలా ఉంటే యూరప్ దేశాలతో పాటు ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ దేశాల్లో కూడా మంకీపాక్స్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇటీవల గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చిన ముగ్గురిలో మంకీపాక్స్ వైరస్ వెలుగులోకి వచ్చింది.

Show comments