Site icon NTV Telugu

BBC: వరస వివాదాల్లో బీబీసీ.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శలు.

Bbc, Anurag Thakur

Bbc, Anurag Thakur

BBC: బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ) వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి 2002 గుజరాత్ అల్లర్లలో లింకు పెడుతూ ప్రసారం చేసిన డాక్యుమెంటరీపై భారత్ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా మరో రెండు వివాదాల్లో చిక్కుకుంది. ప్రముఖ పర్యావరణవేత్త సర్ డేవిడ్ అటెన్ బరో వ్యాఖ్యానంతో కొనసాగే వన్యప్రాణులపై సీరీస్ ఎపిసోడ్ ను నిలివేశారని ఆరోపణ ఎదుర్కొంటోంది. ప్రముఖ ఫుడ్ బాల్ క్రీడాకారుడు, బీబీసీ స్పోర్ట్స్ యాంకర్ గ్యారీ లినేకర్ ని తప్పించడం మరోటి. ఈ రెండింటితో బీబీసీ అసాబుపాలు అయింది. గ్యారీ లినేకర్ విషయంలో బీబీసీ ఉద్యోగులు ఆయనకు సంఘీభావం ప్రకటించారు.

Read Also: Anand Mahindra: మరోసారి ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ ట్వీట్..

డేవిడ్ అటెన్ బరో వ్యాఖ్యానంతో ప్రసారం అవుతున్న ‘వైల్డ్ లవ్’ ప్రోగ్రామ్ 6వ ఎపిసోడ్ ను కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆపేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే దీన్ని బీబీసీ ఖండించింది. ఇందులో ఐదు ఎపిసోడ్లు మాత్రమే ఉన్నాయని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తాము పర్యావరణ అంశాలపై వెనకడుగు వేయమని చెప్పింది. ఇదిలా ఉంటే బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు వలస కార్మికులపై ఉపయోగిస్తున్న భాష, జర్మనీ నాజీలను తలపించేలా ఉందని బీబీసీ స్పోర్ట్స్ యాంకర్ గ్యారీ లినేకర్ ట్వీట్ చేయడంపై బీబీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు బీబీసీ నిష్పక్షపాత వైఖరికి భంగం కలిగించాయంటూ ఆయన్ను సస్పెండ్ చేసింది. అయితే ఈ ఘటనలో అనూహ్యంగా బీబీసీ ఉద్యోగులు గ్యారీకి మద్దతుగా నిలిచారు. విధులను బాయ్‌కాట్ చేశారు.

ఇదిలా ఉంటే స్పోర్స్ట్ యాంకర్ గ్యారీ లినేకర్ను సస్పెండ్ చేయడంపై కేంద్ర ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. రాజకీయ ఇబ్బందులు వస్తాయని వన్యప్రాణుల ఎపిసోడ్ నిలిపివేయడాన్ని ప్రశ్నించారు. మీడియా స్వతంత్రతకు, పాత్రికేయ విలువలకు పెద్దపీట వేస్తామన్న బీబీసీ మాటలు ఆచరణలో ఏమయ్యాయని నిలదీశారు.

Exit mobile version