NTV Telugu Site icon

Israel-Labnon War: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. మేయర్ సహా 15 మంది మృతి

Israellabnonwar

Israellabnonwar

లెబనాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి భీకరదాడులు కొనసాగించింది. దక్షిణ లెబనాన్‌లోని నబాటీహ్‌లోని మునిసిపాలిటీ భవనాలపై మంగళవారం అర్థరాత్రి ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో మేయర్ అహ్మద్ కహిల్ మరణించినట్లుగా నబాతియే ప్రావిన్స్ గవర్నర్ హువైదా టర్క్ ప్రకటించారు. మేయర్‌తో సహా 15మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. దాడిలో కూలిన భవనాల శిథిలాల నుంచి 15 మృతదేహాలను వెలికి తీశామని.. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని లెబనాన్ సివిల్ డిఫెన్స్ పేర్కొంది.

ఇది కూడా చదవండి: Actor Darshan Case: దర్శన్ చేతిలో హతమైన రేణుకాస్వామి భార్యకి మగబిడ్డ..

ఆదివారం దక్షిణ లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాలపై ఇజ్రాయెల్‌ సైన్యం చేసిన దాడుల్లో 15 మంది ఐరాస సైనికులు గాయపడ్డారు. హిజ్బుల్లాకు పట్టున్న ప్రాంతాల నుంచి తక్షణమే ఐరాస దళాలు వైదొలగాలని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు డిమాండ్‌ చేశారు. దక్షిణ లెబనాన్‌పై భూతల దాడులు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 250 మందికి పైగా హెజ్బుల్లా ఫైటర్లు మరణించినట్లు ఐడీఎఫ్‌ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Viral News: బ్యాంకు ఖాతాలో పొరపాటున రూ.16 లక్షలు జమ.. కట్ చేస్తే..