Earthquake: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. కొనసాగుతున్న సునామీ హెచ్చరికలు..

  • ఫిలిప్పీన్స్‌ దగ్గర సముద్రంలో భారీ భూకంపం..
  • రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.6గా నమోదు..
  • సునామీ హెచ్చరికలు జారీ చేసిన వాతవరణ శాఖ..
  • ఫిక్‌ తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచన
Earthquick

Earthquick

Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని మిండనోవా ద్వీపంలో ఈరోజు (అక్టోబర్ 10న) ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.6గా నమోదు అయింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. పసిఫిక్‌ తీరంలో భారీగా అలలు ఎగసిపడతాయని స్థానిక వాతావరణ శాఖ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. అయితే, మనీలాకు ఆగ్నేయాన 62 కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెదర్ డిపార్ట్మెంట్ గుర్తించింది. భూకంప తీవ్రతతో పలు భవనాలు కంపించాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారాయి.