నోబెల్ పురస్కార గ్రహీత, పాక్ హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ కొత్త జర్నీని ప్రారంభించారు.. వివాహ బంధంలోకి అడుపెట్టారు.. 24 ఏళ్ల మలాలా… అసర్ మాలిక్ అనే వ్యక్తిని నిఖా చేసుకున్నారు.. ఆయన ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో పనిచేస్తున్నారు.. బర్మింగ్‌హామ్‌లోని తన ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహ వేడుక నిరాడంబరంగా జరిగింది. ఇక, ఆ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన మలాలా.. ‘ఈ రోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైంది.. అసర్, నేను జీవిత భాగస్వాములమయ్యాం.. బర్మింగ్‌హమ్‌లోని మా ఇంట్లో ఇరు కుటుంబాల సమక్షంలో నిరాడంబరంగా నిఖా వేడుకను నిర్వహించాం.. మాకు మీ ఆశీస్సులు కావాలి.. భార్యభర్తలుగా కొత్త ప్రయాణాన్ని కలసి సాగించడానికి ఆతృతగా ఉన్నాం’ అంటూ మలాలా ట్వీట్ చేశారు.
Read Also: పోలవరం సీఈవో పదవీకాలం పొడిగింపు
కాగా, ఆడపిల్లల చదువు కోసం మలాలా చేసిన సేవల్ని గుర్తిస్తూ.. 2014లో ఆమెకు నోబెల్ శాంతి బహుమతి పురస్కారాన్ని అందజేవారు.. పాకిస్థాన్‌లోని స్వాత్ లోయలో జన్మించిన మలాలా.. బాలిక విద్య కోసం, ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తారు. ఇది జీర్ణించుకోలేకపోయిన తాలిబన్లు 2012లో మలాలా చదువుతున్న పాఠశాల బస్సులోకి చొరబడి ఆమెపై కాల్పులు జరిగాపు.. ఈ ఘటనలో మలాలా ఎడమ కణితి, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పెషావర్‌కు తరలించి చికిత్స అందించండంతో ఆమె ప్రాణాలతో బయటపడిడగా.. బుల్లెట్ గాయాల కారణంగా మెరుగైన ట్రీట్‌మెంట్ కోసం బ్రిటన్‌కు తరలించారు. పలు ఆపరేషన్ల తర్వాత మలాలా కోలుకున్నారు. ఇక, ఆమె బ్రిటన్‌లో తల్లిదండ్రులతో కలసి ఉంటున్నారు. అయితే, ఆడపిల్లల చదువు కోసం మలాలా చేసిన సేవల్ని గుర్తించి 2014లో ఆమెకు నోబెల్ శాంతి బహుమతి పురస్కారాన్ని అందజేయగా.. 17 ఏళ్ల అతిచిన్న వయసులోనే నోబెల్ అందుకున్న యువతిగా మలాలా గుర్తింపు పొందారు. ఇప్పుడు కొత్త జర్నీని ప్రారంభించిన ఆమె.. అందరి ఆశీస్సులను కోరారు.
