48 Killed in Road Accident In Kenya: కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ట్రక్కు అదుపు తప్పి ఇతర వాహనాలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 48 మంది చనిపోయారు. మరోవైపు పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గాయాలు అయిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కెన్యా అధ్యక్షుడు విలియం రూటో సంతాపం వ్యక్తం చేశారు.
భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి పశ్చిమ కెన్యాలో రద్దీగా ఉండే లొండియాని జంక్షన్‌లో ఓ ట్రక్ అదుపుతప్పి.. ఇతర వాహనాలను ఢీ కొట్టింది. అంతేకాదు స్థానిక విక్రయదారులు, పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 48 మంది మృతి చెందినట్లు గుర్తించామని రిఫ్ట్ వ్యాలీకి చెందిన ప్రాంతీయ పోలీసు కమాండర్ టామ్ మ్బోయా ఒడెరో తెలిపారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.
కెరిచో మరియు నకురు పట్టణాల మధ్య హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు, ఇతర వాహనాల క్రింద జనాలు చిక్కుకుకుని ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే కెన్యా రెడ్‌క్రాస్.. ప్రమాద స్థలానికి అంబులెన్స్‌లను పంపింది. అయితే భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలిగిందని స్థానిక పోలీసు కమాండర్ జాఫ్రీ మాయెక్ తెలిపారు. ఈ ఘటనపై అధ్యక్షుడు విలియం రూటో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Also Read: Group-4 Exam: చెప్పులతోనే పరీక్షకు హాజరు కావాలి….. నేడు గ్రూప్-4 పరీక్ష
Also Read: Today Gold Price: పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే!