Site icon NTV Telugu

Japan : నైట్ షిఫ్ట్ లను నిషేధించిన జపాన్.. ఎందుకో తెలుసా?

Japan Company

Japan Company

జపాన్ లో నైట్ షిఫ్ట్ లపై ప్రభుత్వం నిషేధం విధించిందని తెలుస్తుంది.. రాత్రి ఎనిమిది తర్వాత అస్సలు వర్క్ చెయ్యడానికి వీలులేదని తేల్చి చెప్పేసింది.. అందుకు కారణం బర్త్ రేటు తగ్గిపోవడమే అని తెలుస్తుంది..రాత్రి 8 గంట‌ల త‌ర్వాత ప‌నిచేయ‌డంపై జపాన్‌కు చెందిన ఇటోచు కార్పొరేష‌న్ నిషేధం విధించిన ప‌దేండ్ల అనంత‌రం కంపెనీలో మ‌హిళా ఉద్యోగుల సంతాన సాఫ‌ల్య రేటు రెండింత‌లైంది. కంపెనీలో ప‌నిచేసే మ‌హిళా ఉద్యోగుల‌కు 2022 నాటికి ఇద్ద‌రు పిల్ల‌ల చొప్పున ఫెర్టిలిటీ రేటు పెరిగింద‌ని గుర్తించారు…

జపాన్ లో సంతాన రేటు 1.3ను ఈ కంపెనీ ఉద్యోగినులు అధిగ‌మించారు. ఇటీవ‌ల ఉద్యోగుల‌కు వారానికి రెండు రోజులు ఇంటినుంచి ప‌నిచేసేందుకు ఇటోచు అనుమ‌తించ‌డంతో పాటు కార్యాల‌య ప‌ని గంట‌ల‌ను ఎనిమిది నుంచి ఆరు గంట‌ల‌కు కుదించింది. 2010లో జపాన్ ట్రేడింగ్ కంపెనీ ఇటోచు కార్ప్ సీఈవోగా మ‌షిహిరో ఒక‌ఫుజి నియమితులు అయ్యాక రాత్రి ఎనిమిది దాటితే అస్సలు ఆఫీస్ లో ఉండటానికి వీలు లేదని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తుంది..

అనుకోని పరిస్థితులు మిన‌హా నైట్ ఓవ‌ర్‌టైమ్‌ను కూడా ర‌ద్దు చేశారు. ఇక ఈ ప‌దేండ్ల‌లో ఫ్యామిలీమార్ట్ నుంచి మెట‌ల్స్ ట్రేడింగ్ వ‌ర‌కూ ఇటోచు లాభాలు ఏకంగా ఐదింత‌లు పెరిగాయి. 2010 నుంచి 2021 వ‌ర‌కూ ఇబ్బ‌డిముబ్బ‌డిగా కంపెనీ లాభాల‌ను ఆర్జించింది. ఈ క్ర‌మంలో ప‌లువురు మ‌హిళా ఉద్యోగులు మెట‌ర్నిటీ లీవులు తీసుకుని పిల్ల‌ల‌ను క‌ని తిరిగి ప‌నిచేసేందుకు వ‌చ్చారు. తాము ఉత్పాద‌క‌త పెంచేందుకు తీసుకున్న ఈ నిర్ణ‌యం బ‌ర్త్ రేట్‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని తామ‌నుకోలేద‌ని ఇటోచు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫుమిహికో కొబ‌య‌షి చెప్పుకొచ్చారు.. అంతేకాదు ఇది ఆనందంగా ఉందని కూడా చెబుతున్నారు.. త్వరలోనే ఇలాంటి నిబంధనలను పలు దేశాలు అమలు చెయ్యనున్నట్లు తెలుస్తుంది..

Exit mobile version