Site icon NTV Telugu

Shark attack: నలుగురిపై షార్క్ దాడి.. వీడియో వైరల్

Saee

Saee

టెక్సాస్‌ సముద్రంలో షార్క్ చేప తీరంలో బీభత్సం సృష్టించింది. బీచ్‌లో స్నానం చేస్తుండగా టూరిస్టులపై ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సహచర పర్యాటకులు సొరచేప నుంచి రక్షించారు. గాయపడ్డ వారిని బయటకు లాగి సపర్యాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇది కూడా చదవండి: UK-INDIA: నూతన బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్..బ్రిటన్‌-భారత్ మధ్య సంబంధాల పరిస్థితేంటి..?

సముద్ర తీరంలో కొంత మంది స్నానం చేస్తున్నారు. అయితే హఠాత్తుగా ఒక షార్క్ చేప దాడి చేసింది. నలుగుర్ని గాయపరిచింది. దీంతో రక్తం నీటిలో కలవడంతో ఎర్రగా మారిపోయింది. ప్రథమ చికిత్స అనంతరం బాధితుల్ని ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో సొరచేప అక్కడ్నే తిరగడం కనిపించింది. ఓ మహిళకు తీవ్రగాయాలు అయినట్లుగా కనిపించింది. రక్తం ఎక్కువగా కారడంతో సముద్రపు నీరు ఎర్రగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది డ్రోన్లతో పరిసరాల్ని పరిశీలించారు.

ఇది కూడా చదవండి: Team India rally effect: ముంబైలో భారీగా చెత్త.. శుభ్రం చేయడానికి కార్మికులకు ఇక్కట్లు

Exit mobile version