Site icon NTV Telugu

భారీ వ‌ర్షాల‌తో చైనా క‌కావిక‌లం…21 మంది మృతి…

ప్ర‌పంచాన్ని ఒక‌వైపు క‌రోనా భ‌య‌పెడుతుంటే, మ‌రోవైపు భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు భ‌యాన‌కం సృష్టిస్తున్నాయి.  చైనాలో గ‌త కొన్ని రోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.  ఈ వ‌ర్షాల‌కు 21 మంది మృతి చెందిన‌ట్టు చైనా అధికారులు ప్ర‌క‌టించారు.  హుబే ప్రావిన్స్‌లోని 5 న‌గ‌రాల్లో కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా వ‌ర‌ద‌లు భీభ‌త్సం సృష్టించాయి.  యుచెంగ్ న‌గ‌ర‌లంలో ఎప్పుడూలేని విధంగా 400 సెంటీమీట‌ర్ల వ‌ర్షం కురిసింది.  హుబే ప్రావిన్స్‌లోని 774 రిజ‌ర్వాయ‌ర్లు వ‌ర‌దనీటితో పూర్తిస్థాయిలో నిండిపోయాయి.  ఆగ‌కుండా వ‌ర‌ద వ‌స్తుండ‌టంతో ఆయా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్‌ను ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం.  యాంగ్జీ న‌ది ఉగ్ర‌రూపం దాల్చ‌డంతో ఆ ప్రాంతంలో నివ‌శించే ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు.  

Read: 40 ఏళ్ళ‌నాటి కేకు… భారీ ధ‌ర‌కు అమ్మ‌కం…

Exit mobile version