NTV Telugu Site icon

“రస్ట్‌” మూవీ సెట్‌లో ప్రమాదం..

మహిళా సినిమాటోగ్రాఫర్‌ మృతి
రస్ట్‌ మూవీ షూటింగ్‌ సెట్‌ రిహార్సల్స్ లో గన్‌ పేలి మహిళా సినిమాటోగ్రాఫర్‌ మృతి చెందారు. న్యూ మెక్సికోలోని హాలీవుడ్ సినిమా సెట్‌లో మూవీ షూటింగ్‌ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సినిమాలో ఫ్రాన్సిస్‌ ఫిషర్, మిస్టర్‌ బాల్డ్విన్‌ మీద సన్నివేశం చిత్రీకరిస్తున్న సమంలో ఆయన ప్రాప్‌ గన్‌ను కాల్చారు. దీంతో సినిమాటోగ్రాఫర్‌ హాలీనా హచ్చిన్స్‌ మృతి చెందారు. దర్శకుడు జోయొల్‌ సౌజా గాయపడ్డారు. బాల్డ్విన్‌ గతంలో ద క్యాట్ ఇన్‌ ద హ్యట్‌, పెరల్‌ హార్బర్, ద ఎడ్జ్‌, ద షాడో, తదితర చిత్రాల్లో నటించారు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనపై సినిమా యూనిట్‌ షాక్‌లో ఉంది. ఈ మొత్తం అంశం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.