Site icon NTV Telugu

భారత్‌కు రూ.135 కోట్ల సహాయం ప్రకటించిన గూగుల్ !

ఇండియాలో కరోనా విలయం మామూలుగా లేదు. ప్రతి రోజూ 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఇండియా మరింత డేంజర్ లో పడనుంది. ఇలాంటి సమయంలో ఇండియాకు సహాయం చేసేందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ గూగుల్ ముందుకు వచ్చింది. ఏకంగా రూ.135 కోట్ల రూపాయల విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్. కరోనా నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్న గీవ్ ఇండియాకు, యూనిసెఫ్ కు ఈ ఫండ్ అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇండియాకు సహాయ మందించేందుకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, జర్మనీ లాంటి దేశాలతో పాటు పాకిస్థాన్ కూడా ముందుకు వచ్చింది. కొవిషీల్డ్ టీకా తయారీకి అవసరమైన ముడి పదర్థాలను భారత్‌కు పంపాలని అమెరికా నిర్ణయించింది. అలాగే ఇండియా కు ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ఫ్రాన్స్, బ్రిటన్ కూడా ఒక అడుగు ముందుకు వేశాయి.

Exit mobile version