NTV Telugu Site icon

Big Breaking: దుండగుల కాల్పుల్లో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దుర్మరణం

Shinzo Abe Died

Shinzo Abe Died

దుండగుల కాల్పుల్లో జపాన్​ మాజీ ప్రధాని షింజో అబే దుర్మరణం పాలయ్యారు. జపాన్ పశ్చిమ ప్రాంతంలోని నారా సిటీలో ఓ బహిరంగ సభలో షింజో ప్రసంగిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కాల్పుల్లో మాజీ ప్రధాని తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తోన్న సమయంలో ఆయనపై రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఆ వెంటనే ఆయన వేదిక మీదే కుప్పకూలిపోయారు. సంఘటన జరిగిన వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జపాన్ మాజీ ప్రధాని షింజే మృతి చెందినట్టుగా స్థానిక మీడియా తెలిపింది.

Shnizo Abe: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు.. పరిస్థితి విషమం

“జపాన్ మాజీ ప్రధాని షింజో వెస్టరన్ జపాన్‌లోని నారా సిటీలో ఓ సభలో ప్రసంగిస్తుండగా కుప్పకూలారు. ప్రాథమిక రిపోర్టుల ప్రకారం.. గాయమైనట్లు తెలుస్తుంది. గన్ షాట్ లాంటి శబ్దం వినిపించింది. ఆ తర్వాత కిందపడిన అతనికి రక్తం కారుతుంది. నిందితులను అదుపులోకి తీసుకున్నారు” అని ఎన్​హెచ్​కే రిపోర్టర్ తెలిపారు. ఇక 2006-2007, 2012-20 రెండు పర్యాయాలు జపాన్‌ ప్రధానిగా షింజో అబే సేవలు అందించారు.