Site icon NTV Telugu

Israel-Iran War: యూఎస్-ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ మాజీ అధ్యక్షుడు మృతి..

Iran Ex President

Iran Ex President

Israel-Iran War: యూఎస్, ఇజ్రాయిల్- ఇరాన్ యుద్ధం ముదురుతోంది. ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. టాప్ 40 కమాండర్లను కూడా చంపేసినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. ఇందులో రక్షణ మంత్రితో పాటు ఇరాన్ కీలక ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) చీఫ్ కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే, శనివారం ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్ మరణించారు. ఈ దాడిలో అహ్మదీనెజాద్ సన్నిహిత సలహాదారులు మరియు అంగరక్షకులు కూడా మరణించారని సమాచారం. శనివారం జరిగిన వైమానిక దాదిలో అహ్మదీనేజాద్ తన టీమ్‌తో ఉన్న భవనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఈశాన్య టెహ్రాన్‌లోని నర్మాక్ ప్రాంతంలో మాజీ అధ్యక్షుడి నివాసం ఉంటుంది, దీనిపై దాడి చేసి ఆయనను హతం చేసినట్లు తెలుస్తోంది. అహ్మదీనేజాద్ 2005-15 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇరాన్ అణు కార్యక్రమాలకు బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు.

Exit mobile version