Florida Plane Crash: ఫ్లోరిడా ప్లేన్ క్రాష్.. లవర్‌కు పైలట్ చివరి మెసేజ్.. టెక్ వ్యాపారవేత్త కుటుంబం దుర్మరణం..

  • ఫ్లోరిడాలో ఆదివారం లియర్‌జెట్ 60 విమానం ప్రమాదం..
  • టెక్ వ్యాపారవేత్త కుటుంబంతో సహా 9 మంది దుర్మరణం..
  • ప్రమాదానికి 10 నిమిషాల ముందు ప్రియుడికి పైలట్ చివరి మెసేజ్..
Florida Plane Crash

Florida Plane Crash

Florida Plane Crash: అమెరికాలోని ఫ్లోరిడాలో ఆదివారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ లియర్‌జెట్ 60 విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో సహా మొత్తం 9 మంది దుర్మరణం పాలయ్యారు. ఆస్టిన్, టెక్సాస్ నుంచి బహామాస్‌కు వెళ్తున్న లియర్‌జెట్ విమానం నియంత్రణ కోల్పోవడంతో అత్యంత వేగంగా వచ్చి నేలపై కుప్పకూలింది. విమాన రెక్కలపై మంచు కూరుకుపోవడం, టర్బులెన్స్, పైలట్ల తప్పిదం వంటి అంశాలు ప్రమాదానికి కారణమయ్యాయా.? అనే కోణంలో అమెరికా నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) దర్యాప్తు చేస్తోంది.

టెక్ వ్యాపారవేత్త కుటుంబం బలి..

మృతుల్లో టెక్సాస్‌కు చెందిన టెక్ వ్యాపారవేత్త ఆడమ్ రాబిన్సన్, ఆయన బార్య హెలిన్ షార్ప్, నాలుగు, రెండేళ్ల చిన్నారులు, మరో ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. రాబిన్సన్ RB2B, Retention.com సంస్థల వ్యవస్థాపకుడు, సీఈవోగా వ్యవహరించారు. Moltsets సంస్థకు కూడా నాయకత్వం వహించారు. గతంలో అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ లెమాన్ బ్రదర్స్, బ్యాంకింగ్ సంస్థ బార్క్లేస్‌లో పనిచేశారు.విమానంలో వీరిలో పాటు మరో ముగ్గురు ప్రయాణికుల్ని రాచెల్ రీడ్, చార్మీ ఫెహర్, అనితా మరియా సెటినా ఉన్నారు.

ప్రమాదానికి 10 నిమిషాల ముందు ప్రియుడికి పైలట్ మెసేజ్..

విమానాన్ని ఇద్దరు మహిళా పైలట్లు నడుపుతున్నారు. విమాన పైలట్‌గా 55 ఏళ్ల జెఫ్ గ్రెగరీ ఉండగా, కోపైలట్‌గా 20 ఏళ్ల నథాలియా ఫిల్గ్యురాస్‌‌ ఉన్నారు. విమానం కూలిపోతున్న సమయంలో ఇద్దరు పైలట్లు తీవ్ర భయంతో మాట్లాడుతున్న ఆడియో ఏటీసీలో రికార్డైంది. నథాలియా 17 ఏళ్ల వయసులోనే పైలట్ లైసెన్స్ పొందారు.

విమానం కూలిపోవడానికి 10 నిమిషాల ముందు నథాలియా తన ప్రియుడికి చివరి మెసేజ్ పంపినట్లు తెలిసింది. ‘‘మా విమానానికి టర్బులెన్స్ ఎదురైంది. మంచు పేరుకుపోతోంది’’ ఆమె తన సందేశాన్ని పంపింది. ఆమె ప్రియుడు కూడా పైలట్ అని తెలుస్తోంది. ఈ మెసేస్ నవంబర్ 1 మధ్యాహ్నం 12.40కి పంపిస్తే, 12.50 గంటలకు ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీలో లియర్ జెట్ 60 కుప్పకూలింది.