Finland Prime minister: ఫిన్లాండ్ ప్రధానమంత్రి సనా మారిన్ ఓ పార్టీలో డ్యాన్స్ చేయడం వివాదానికి దారి తీసింది. పార్టీలో సనా మారిన్ డ్రగ్స్ తీసుకున్నారని ఫిన్లాండ్ విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రధాని డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది నెటిజెన్లు దీన్ని తప్పుపట్టారు. అయితే ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో ప్రధాని సనా మారిన్ శనివారం డ్రగ్ టెస్ట్ చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ టెస్ట్‌కు సంబంధించిన రిపోర్టు ఇవాళ వచ్చింది.
పార్టీ వీడియో వైరల్ కావడంతో అందరి అనుమానాలు నివృత్తి చేసేందుకు మారిన్ డ్రగ్స్ పరీక్ష చేయించుకున్నారు. ఆమె మూత్రం నమూనాలను పరీక్షించగా నెగెటివ్‌గా తేలింది. ‘ప్రధాని సనా మారిన్ నుంచి ఆగస్టు 19, 2022న నమూనాలు సేకరించాం. వాటిలో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించలేదు. నిబంధనలకు అనుగుణంగానే ఈ పరీక్ష జరిగింది’ అని ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
ఇటీవల ఓ పార్టీలో ప్రధాని మారిన్ తో పాటు మరో ఆరుగురు మహిళలు డ్యాన్స్ చేస్తున్న వీడియో లీక్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ప్రధాని మారిన్ నెలపై కూర్చొని డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపించారు. దీంతో ఆమె డ్రగ్స్ తీసుకున్నారనే అనుమానాలను అక్కడి ప్రతిపక్షాలు వ్యక్తపరిచాయి. అయితే ప్రతిపక్షాల విమర్శలను ప్రధాని సనా మారిన్ ఖండించారు. అయితే ప్రధాని పదవిలో ఉన్న మారిన్ అందుకు తగ్గట్లు హుందాగా వ్యవహరించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే అత్యవసర పరిస్థితి ఏర్పడితే.. ఆమె నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉందా.. అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సనా మారిన్ 34 ఏళ్ల వయసులో 2019లో ప్రధాని పదవిని చేపట్టారు.
Arms Recovered: ఇండో-పాక్ సరిహద్దులో భారీగా ఆయుధాలు పట్టివేత
సాయంత్రం స్నేహితులం అంతా కలిసి పార్టీ చేసుకున్నామని.. ప్రైవేటు పార్టీ వీడియోలు లీక్ కావడం దురదృష్టకరమని ఆమె అన్నారు. కేవలం ఆల్కాహాల్ మాత్రమే తీసుకున్నానని.. డ్రగ్స్ తీసుకోలేదని.. తాను జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని ఆమె గతంలో కూడా వెల్లడించారు. నా జీవితంలో ఎన్నడూ డ్రగ్స్‌ను వాడలేదని ఆమె పేర్కొంది.