NTV Telugu Site icon

Droupadi murmu: రాష్ట్రపతికి అరుదైన గౌరవం.. ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం

Droupadimurmu

Droupadimurmu

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తుతం విదేశాల్లో పర్యటిస్తున్నారు. మూడు విదేశాల పర్యటనకు ఆమె వెళ్లారు. ప్రస్తుతంలో ఫిజీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘కంపానియన్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ఫిజీ’ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు రతు విలియమ్‌ మైవలిలీ కటోనివేర్‌ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం అధికారిక ఎక్స్‌లో పేర్కొంది.

ఇది కూడా చదవండి: Kalki 2898 AD: మరో రికార్డు బ్రేక్ చేసిన ప్రభాస్ సినిమా

ఇదిలా ఉంటే ఫిజీ పార్లమెంటును ఉద్దేశించి ముర్ము మాట్లాడారు.. ఫిజీని బలమైన. సంపన్నమైన దేశంగా మార్చేందుకు భారత్‌ అండగా నిలుస్తుందన్నారు. రెండు దేశాల ప్రజలకు మంచి జరుగుతుందని ఆకాంక్షించారు. 10 ఏళ్ల క్రితం ఫిజీ పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలను గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: Macherla Crime: మాచర్లలో విద్యార్థిని మృతి కేసులో ట్విస్ట్‌.. తండ్రి వల్లే..!

 

Show comments