Site icon NTV Telugu

COVID 19: ఆ వేరియంట్‌తో మళ్లీ ముప్పు.. అమెరికా వార్నింగ్..

విలయం సృష్టించిన కరోనా మహమ్మారి.. క్రమంగా తగ్గుముఖం పడుతోంది.. ఇదే సమయంలో చైనా సహా మరికొన్ని దేశాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడం.. కట్టడా చేసేందుకు లాక్‌డౌన్‌ లాంటి చర్యలకు పూనుకోవడం మళ్లీ కలకలం రేపుతోంది.. ఇదే సమయంలో.. కోవిడ్‌ మహమ్మారిపై అమెరికాలోని శ్వేతసౌధం ముఖ్య ఆరోగ్య సలహాదారు ఆంటోనీ ఫౌచీ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.. ఒమిక్రాన్‌కు చెందిన ఉప వేరియంట్ బీఏ.2 కారణంగా అమెరికాలో మరోసారి కరోనా విజృంభిస్తుందని.. పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు ఆంటోనీ ఫౌచీ..

Read Also: Murder: ఏపీలో పరువు హత్య.. వేటకొడవళ్లతో నరికి..

ఇక, కొత్త వేరియంట్‌ వ్యాప్తిపై సంచలన విషయాలు బటపెట్టారు ఫౌచీ.. ఒమిక్రాన్‌తో పోలిస్తే కొత్త వేరియంట్ బీఏ.2 60 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని హెచ్చరించిన ఆయన.. కాకపోతే దీనివల్ల తీవ్రమైన దుష్పరిణామాలు ఉండవని తెలిపారు.. అమెరికాలో నమోదయ్యే కొత్త కేసుల్లో ఈ ఉప వేరియంట్ రకానికి చెందినవే 30శాతం ఉంటాయని చెప్పుకొచ్చారు.. ఇక, అమెరికాలో అత్యంత ప్రభావం చూపే వేరియంట్‌గా బీఏ.2 నిలుస్తుందని అంచనా వేశారు ఆంటోనీ ఫౌచీ.

Exit mobile version