Donald Trump: భారత్-అమెరికా మధ్య సంబంధాలపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలపై ఆయన మాట్లాడుతూ.. తాము భారత్, రష్యాలకు దూరమైనట్లే అని పేర్కొన్నారు. షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో ప్రధాని మోడీ, పుతిన్, జిన్‌పింగ్‌లు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన ట్రంప్.. ఆ మూడు దేశాలు ఉజ్వల భవిష్యత్తు కలిగి ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఇక భారత్, రష్యాలను చైనా కోల్పోయినట్లు కనిపిస్తోంది. ఆ మూడు దేశాలకు సుసంపన్నమైన భవిష్యత్తు ఉండాలని కోరుతూ, తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో వ్యంగ్యంగా పోస్టు చేశారు.
Read Also: సాక్షి అగర్వాల్ ఓణం స్పెషల్ : సోషల్ మీడియాను ఊపేసిన ఫోటోలు!
ఇక, ప్రతీకార టారీఫ్స్ తో ప్రపంచ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడుతున్న వేళ.. తియాన్‌జిన్ వేదికగా జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో రష్యా, చైనా, భారత్ అధినేతలు ఒకే వేదికపై కలిశారు.అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లపై చర్చించి.. తామంతా ఏకతాటిపై ఉన్నట్లు అమెరికాకు సంకేతాలు పంపించారు. వీరి భేటీపై ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘ చర్చ కొనసాగుతుంది. ట్రంప్ తీరుతోనే ఆ మూడు దేశాలు ఒక్కటయ్యాయనే వాదన కూడా యూఎస్ లో వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో మిత్ర దేశంగా ఉన్న భారత్ తమకు దాదాపుగా దూరమైనట్లు అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
