Site icon NTV Telugu

సిడ్నీలో డెల్టా వ‌ణుకు… లాక్‌డౌన్ అమ‌లు…

డెల్టా వేరియంట్ ప్ర‌పంచంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది.  ఇండియాలో సెకండ్ వేవ్‌కు కార‌ణ‌మైన డెల్టా వేరియంట్ ఇప్ప‌టికే అనేక దేశాల్లో వ్యాపించింది.  ఇప్పుడు ఈ వేరియంట్ కేసులు ఆస్ట్రేలియాను భ‌య‌పెడుతున్నాయి.  మొద‌టివేవ్‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొన్న ఆస్ట్రేలియాలో డెల్టాకేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి.  సిడ్నిన‌గ‌రంలో ఈ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి.  దీంతో ఆ న‌గ‌రంలోని అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించి ఆంక్ష‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు.  

Read: ఈటల చేరిక : తెలంగాణ బీజేపీలో నేతల వర్గపోరు?

ఏయిర్‌పోర్ట్ లోని ట్రావెల్ బ‌స్ డ్రైవ‌ర్‌కు క‌రోనా సోక‌డం, అక్క‌డి నుంచి డెల్టావేరియంట్ సిడ్నీ న‌గ‌రంలో అనేక మందికి సోక‌డంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది.  వైర‌స్ చైన్‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఎక్క‌డిక‌క్క‌డ క‌ఠినంగా ఆంక్ష‌లు అమ‌లుచేస్తున్నారు.  

Exit mobile version