కరోనా మహమ్మారిపై పోరాటంలో ఇప్పుడు వ్యాక్సిన్ల పాత్రే కీలకం.. ఇప్పటికే భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను భారత్‌లో వినియోగిస్తున్నారు.. కొన్ని దేశాల్లోనూ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.. కానీ, ప్రపంచ ఆరోగ్యసంస్థ మాత్రం ఇప్పటి వరకు కోవాగ్జిన్‌పై క్లారిటీ ఇవ్వలేదు.. తాజాగా.. కోవాగ్జిన్ వ్యాక్సిన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్.. మరో 4 – 6 వారాల్లోగా లేదా ఆగస్టు తొలి వారంలో కోవాగ్జిన్ టీకాపై నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. భారత్ బయోటెక్.. కోవాగ్జిన్‌కు సంబంధించిన డేటాను తన పోర్టల్‌లో ఇప్పుడిప్పుడే అప్‌లోడ్ చేస్తోందని, ఆ డేటాను సమీక్షిస్తున్నట్టు తెలిపారు సౌమ్యా స్వామినాథన్..
సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వెబినార్‌లో మాట్లాడిన సౌమ్యా స్వామినాథన్.. కోవాగ్జిన్‌ను ఈయూఎల్‌లో చేర్చేందుకు ఒక ప్రక్రియ ఉంటుంది.. తయారీ సంస్థలు టీకాల మూడు దశల ప్రయోగాలను పూర్తిచేసి.. ఆ డేటాను డబ్ల్యూహెచ్‌వో రెగ్యులేటరీ విభాగానికి సమర్పించారు. తర్వాత నిపుణుల కమిటీ దాన్ని విశ్లేషిస్తోందన్నారు. మా నిపుణుల కమిటీ పరిశీలించే తర్వాతి వ్యాక్సిన్ కోవాగ్జిన్ అన్న ఆమె.. మరో నాలుగు నుంచి ఆరు వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.
