NTV Telugu Site icon

Spider Nesting Inside Ear: చెవి నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. చూసి షాకైన డాక్టర్లు..

Spider Nest Inside Ear

Spider Nest Inside Ear

Spider Nesting Inside Ear: చైనాలో విచిత్ర సంఘటన జరిగింది. చెవినొప్పితో బాధపడుతున్న ఓ మహిళ ఆస్పత్రికి వెళ్లింది. అంతా పరీక్షించిన తర్వాత షాక్ తినడం డాక్టర్ల వంతైంది. సదరు మహిళ చెవిలో ఓ సాలీడు ఏకంగా గూడు కట్టుకుని ఓ కుటుంబాన్ని పెంచుకుంటోంది. మహిళ టిన్నిటస్( రింగింగ్ సౌండ్ వినడం) చెవి నొప్పితో డాక్టర్లను సంప్రదించిన సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో ఈ ఘటన జరిగింది.

Read Also: Poonch Terror Attack: ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఆరుగురి అరెస్ట్..

డాక్టర్ మహిళ చెవిని ఎండోస్కోపీ చేస్తున్న సమయంలో, చెవిలో ఓ సాలీడు గూడు కట్టుకుని ఉన్న విషయం స్పష్టంగా కనిపించింది. నిజానికి ముందుగా సాలీడు అల్లిన గూడును ముందుగా కర్ణభేరి అనుకున్నప్పటికీ, తరువాత ఇది కర్ణభేరి కాదన్న విషయం తెలిసింది. హుయిడాంగ్ కౌంటీ పీపుల్స్ హాస్పిటల్ లో కెమెరాతో అమర్చిన ప్రత్యేక ట్వీజర్లతో మహిళ చెవిపై ఎండోస్కోపీ నిర్వహించిన సందర్భంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సాలీడు అల్లిన ఈ గూడును తొలిచిన తర్వాత దాని వెనక ఓ సాలీడు నివాసం ఉండటంమే కాకుండా ఓ కుటుంబాన్ని పెంచుకున్నట్లు తేలింది. పరీక్ష సమయంలో ఎండోస్కోపిక్ ట్యూబ్ పై సాలీడు దాడి చేసింది.

సాలీడు తయారు చేసుకున్న గూడు కర్ణభేరిని పోలీ ఉంది. దగ్గరగా వెళ్లి చూస్తేనే అది ఓ సాలీడు గూడు అని తెలిసింది. ముందుగా సాలీడును బయటకు తీసే సమయంలో పారిపోయేందుకు ప్రయత్నించిందని, ఆ తరువాత సజావుగా దాన్ని చెవి నుంచి బయటకు తీసినట్లు ఓటోలారిన్జాలజీ విభాగానికి చెందిన డాక్టర్ హాన్ జింగ్ లాంగ్ చెప్పాడు. ఇది విషపూరిత సాలీడు కాకపోవడం అదృష్టమని, స్పైడర్ వల్ల మహిళ చెవి స్వల్పంగా దెబ్బతిందని ఆయన తెలిపాడు.