Site icon NTV Telugu

China: ప్రపంచంలోని తొలిసారిగా ఫోర్త్ జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్‌ని ప్రారంభించిన చైనా..

China

China

China: ప్రపంచంలో మొట్టమొదటిసారి చైనా నెక్ట్స్ జనరేషన్ గ్యాస్డ్-కూల్డ్ న్యూక్లియర్ రియాక్టర్‌ పవర్ ప్లాంట్ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించినట్లు చైనా స్టేట్ మీడియా బుధవారం వెల్లడించింది. తూర్పు షాన్‌డాంగ్ ప్రావిన్సులోని షిడావో బే ప్లాంట్‌లో ఈ ఫోర్త్ జనరేషన్ రియాక్టర్‌ని ప్రారంభించారు.

ఈ రియాక్టర్‌లో వెలువడే అధిక ఉష్ణోగ్రతల్ని సంప్రదాయ పద్దతిలో ప్రైజరైజ్డ్ వాటర్‌ ఉపయోగించి చల్లబరుస్తారు, కొత్తగా చైనా నిర్మించిన రియాక్టర్‌ని అలా కాకుండా గ్యాస్ ద్వారా చల్లబరుస్తారని జిన్హూవా మీడియా నివేదించింది. ఈ విధానం సమర్థవంతంగా ఉండటంతో పాటు తక్కువ ఖర్చుతో కూడుకున్నదని తెలిపింది.

సంప్రదాయ రియాక్టర్లు అణుశక్తి నుంచి విద్యుత్‌ని ఉత్పత్తి చేశాయి. అయితే ఈ అధునాతన స్మాల్ మాడ్యులర్ రియాక్టర్(ఎస్ఎంఆర్)లు పారిశ్రామిక అవసరాల కోసం హీటింగ్, డీశాలినేషన్, వంటి ఇండస్ట్రియల్ అప్లికేషన్స్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు.

Read Also: PM Modi: ప్రధాని మోడీ ఎల్లప్పుడు ప్రణబ్ ముఖర్జీ కాళ్లకు నమస్కరించే వారు: ప్రణబ్ కూతురు శర్మిష్ట..

పాశ్చాత్య దేశాలతో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నుంచి విముక్తి పొందాలని, అదే సమయంలో విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా దేశీయ టెక్నాలజీ వినియోగించుకోవాలని అనుకుంటోంది. షిడావో బే ప్లాంట్‌లో 90 శాతానికి పైగా పరికరాలు చైనీస్ డిజైన్‌తో ఉన్నాయని ప్రాజెక్ట్ మేనేజర్ జాంగ్ యాన్క్సు జిన్హువాతో చెప్పారు. ఈ ప్లాంట్ నిర్మాణం 2012లో ప్రారంభమైంది. మొదటి ఎస్ఎంఆర్ 2021లో పవర్ గ్రిడ్‌తో అనుసంధానించబడుతుంది.

ఎస్ఎంఆర్‌లు డీకార్బోనైజేషన్, ఎనర్జీ ట్రాన్స్‌మిషన్లలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. చిన్నగా, సరళీకృతంగా ఉండే వీటి డిజైన్ తక్కువ ఖర్చు, నిర్మాణ సమయాన్ని ఆదా చేస్తుంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం, 80 కంటే ఎక్కువ SMR ప్రాజెక్టులు ప్రస్తుతం 18 దేశాలలో అభివృద్ధిలో ఉన్నాయి.

Exit mobile version