చైనా ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎవరికీ తెలియదు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దానిని అమలు చేసి తీరాల్సిందే. వ్యతిరేకిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వానికి భయపడి ఎవరూ ఎదురుచెప్పరు. తాజాగా డ్రాగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనాలో కారియోకీ పాటలు విరివిగా వినిపిస్తుంటాయి. వీటికి అభిమానులు అత్యధికంగా ఉంటారు. వీటిని బార్లలో వీటిని ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. కారియోకీ పాటల అవుట్‌లెట్లు సుమారు ఆ దేశంలో 50 వేలకు పైగా ఉన్నాయి. కారియోకి పాటలపై చైనా నిషేదం విధించడం వెనుక అనేక కారణాలు చెబుతున్నది ప్రభుత్వం. చైనా జాతీయ ఐక్యత, సార్వభౌమత్వానికి హాని కలిగించేలా ఈ పాటలు ఉన్నాయని, మతపరమైన విధానాలను ఉల్లంఘించే విధంగా ఉండటంతో పాటుగా, మాదకద్రవ్యాలను ప్రోత్సహించే విధంగా పాటులు ఉంటున్నాయని డ్రాగన్ ప్రభుత్వం ఆరోపణ. కారియోకి పై విధించిన నిషేదం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నది.
ఆ పాటలపై చైనా నిషేదం…ప్రజలు తీవ్ర అసంతృప్తి…
